అన్వేషించండి

GATE Admit Cards: నేడు గేట్‌-2024 అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2024 పరీక్ష అడ్మిట్ కార్డులు జనవరి 3 నుంచి అందుబాటులోకి రానున్నాయి.. ఐఐఎస్సీ బెంగళూరు హాల్‌టికెట్లను విడుదల చేయనుంది.

GATE 2024 Admit Card: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2024 పరీక్ష అడ్మిట్ కార్డులు (GATE Halltickets) జనవరి 3 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఐఐఎస్సీ బెంగళూరు (IISC Bengaloru) హాల్‌టికెట్లను విడుదల చేయనుంది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచనుంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డులు విడుదలైన తర్వాత తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా ఈమెయిల్ ఐడీతోపాటు పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది 8లక్షలకు పైగా అభ్యర్థులు గేట్‌ రాయనున్నారు. 

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం  ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్-2024 పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించి అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను ఫిబ్రవరి 16న, ఆన్సర్ కీని ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నారు. అనంతరం ఆన్సర్ కీపై అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్చి 16న గేట్ ఫలితాలను వెల్లడించనున్నారు. అభ్యర్థులు మార్చి 23 నుంచి గేట్ స్కోరుకార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

30 సబ్జెక్టులకు పరీక్ష..
దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. గేట్‌లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి.  'గేట్‌'లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది.

గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీలు (బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తోపాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి.

అభ్యర్థులకు సూచనలు..
అడ్మిట్ కార్డుపై పరీక్షా కేంద్రానికి సంబంధించిన వివరాలతో పాటు షిఫ్ట్ సమయం కూడా ఉంటుంది. పరీక్ష కేంద్రానికి వెళ్లే సమయంలో అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డుతో పాటు తప్పనిసరిగా ఏదైనా ఒరిజినల్ ఐడీకార్డును వెంట తీసుకెళ్లాలి. లేదంటే పరీక్ష నిర్వాహకులు పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరు. మొబైల్స్, క్యాలికేటర్లు, రిస్ట్ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను లోనికి అనుమతించరు. పరీక్ష కేంద్రంలోని వెళ్లేముందు అడ్మిట్ కార్డు, ఐడీ ఫ్రూప్, పెన్ వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుపై సంతకాన్ని పోలి ఉండేలా పరీక్షా కేంద్రంలో సదరు అభ్యర్థి సంతకం చేయాల్సి ఉంటుంది. అప్పుడే గేట్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. 

పరీక్ష విధానం..

✦ మొత్తం 30 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు.. ఇతర దేశాలలోని నగరాల్లో కూడా గేట్ పరీక్ష నిర్వహిస్తారు.

✦ ప్రకటించిన తేదీల్లో మొత్తం రెండు సెషన్లలో (9:30 am - 12:30 pm,  2:30 pm - 5:30 pm.) గేట్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

✦ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే గేట్ పరీక్షలో 100 మార్కులకు 65 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలకుగాను 15 మార్కులు; టెక్నికల్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల నుంచి 55 ప్రశ్నలకుగాను 85 మార్కులు ఉంటాయి.

✦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. 1 మార్కు ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 1/3 చొప్పున, 2 మార్కుల ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 2/3 చొప్పున కోత విధిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..

తెలంగాణలో: హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్.

ఏపీలో: చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కర్నూలు.

Notification

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sunita Williams: మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Sunita Williams Village Celebrations: సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
Sunita Williams Village Celebrations: సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP DesamSunita Williams Crew 9 Dragon Capsule Splash Down | భూమిపైకి క్షేమంగా సునీతా విలియమ్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sunita Williams: మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Sunita Williams Village Celebrations: సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
Sunita Williams Village Celebrations: సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Sunita Williams : 'మా మనసులు గెలుచుకున్నారు': సునీతా విలియమ్స్‌పై మోదీ ప్రశంస 
'మా మనసులు గెలుచుకున్నారు': సునీతా విలియమ్స్‌పై మోదీ ప్రశంస 
Sunita Williams Returns: సునీతమ్మ వచ్చేసిందోచ్‌- సురక్షితంగా అంతరిక్షం నుంచి అమ్మ ఒడికి
సునీతమ్మ వచ్చేసిందోచ్‌- సురక్షితంగా అంతరిక్షం నుంచి అమ్మ ఒడికి
Voter Card: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
Betting apps case: బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
Embed widget