అన్వేషించండి

ICAR UG 2022: ఐసీఏఆర్ యూజీ అడ్మిట్ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్‌లో వివిధ డిగ్రీ, పీజీ, డాక్టరల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ICAR) యూజీ పరీక్షల అడ్మిట్‌కార్టులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  సెప్టెంబరు 10న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్‌ను అందుబాటులో ఉంచింది. పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి తమ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టినతేది వివరాలు సమర్పించి హాల్‌టికెట్లు పొందవచ్చు.

ICAR UG 2022 అడ్మిట్‌కార్డు డైరెక్ట్ లింక్..

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 13 నుంచి ఐసీఏఆర్ యూజీ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది. సెప్టెంబరు 13, 14, 15 తేదీల్లో పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ ఏర్పాట్లు చేసింది. 

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్‌లో వివిధ డిగ్రీ, పీజీ, డాక్టరల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబరు 13, 14 ,15 తేదీల్లో యూజీ పరీక్షలు జరుగనున్నాయి. అదేవిధంగా సెప్టెంబరు 20న పీజీ, పీహెచ్‌డీ పరీక్షలను కూడా ఎన్టీఏ నిర్వహించనుంది.

ఐసీఏఆర్ ఏఐఈఈఏ (ఆల్ ఇండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్) యూజీ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. పీజీ, పీహెచ్‌డీ పరీక్షలను మాత్రం కేవలం ఇంగ్లిష్ మాధ్యమంలోనే నిర్వహిస్తారు.

ICAR UG 2022 అడ్మిట్ కార్డు ఇలా పొందండి..
Step 1: అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- icar.nta.nic.in.
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Download Admit Card –ICAR (UG) 2022' లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: లాగిన్ పేజీలో అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి. 
Step 4: ICAR UG 2022 అడ్మిట్ కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద దర్శమిస్తుంది. 
Step 5: భవిష్యత్ అవసరాల కోసం అడ్మిట్ కార్డు ప్రింట్ తీసుకోవాలి. 

Note: పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా తమ అడ్మిట్‌కార్డులు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంట తీసుకెళ్లడం ఉత్తమం.

యూజీ కోర్సులు..
1) బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్
2) బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్
3) బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ
4) బీఎఫ్‌ఎస్సీ 
5) బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ 
6) బీఎస్సీ (ఆనర్స్)  సెరికల్చర్
7) బీటెక్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ 
8) బీటెక్ డెయిరీ టెక్నాలజీ 
9) బీటెక్ ఫుడ్ టెక్నాలజీ 
10) బీటెక్ బయోటెక్నాలజీ 

పీజీ కోర్సులు:
ప్లాంట్ బయోటెక్నాలజీ, హార్టికల్చర్, ప్లాంట్ సైన్స్, ఫారెస్ట్రీ/ఆగ్రోఫారెస్ట్రీ/సిల్వికల్చర్, ఫిజికల్ సైన్స్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ, ఎంటమాలజీ అండ్ నెమటాలజీ, వాటర్ సైన్స్ & టెక్నాలజీ, ఆగ్రోనమీ, హోంసైన్స్, సోషల్ సైన్స్, ఏనిమల్ బయోటెక్నాలజీ, స్టాటిస్టికల్ సైన్సెస్, వెటర్నరీ సైన్స్, డెయిరీ సైన్సెస్, ఏనిమల్ సైన్స్, డెయిరీ టెక్నాలజీ, ఫిషరీస్ సైన్సెస్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Embed widget