GATE 2023: వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 ఫలితాలను ఐఐటీ కాన్పూర్ మార్చి 16న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థుల స్కోరు కార్డులను మార్చి 21న విడుదల చేసింది.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 ఫలితాలను ఐఐటీ కాన్పూర్ మార్చి 16న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థుల స్కోరు కార్డులను మార్చి 21న విడుదల చేసింది. స్కోరుకార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐఐటీ కాన్పూర్ ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 25 వరకు అభ్యంతరాలు స్వీకరించింది.
గేట్-2023 స్కోరుకార్డు కోసం క్లిక్ చేయండి..
గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీల(బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తో పాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి. గేట్ ద్వారా ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు డాక్టోరల్ పోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు గేట్ పరీక్షలో సాధించిన స్కోరు ఫలితాల వెల్లడి నుంచి 3 సంవత్సరాల పాటు వర్తిస్తుంది.
Also Read:
సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-పీజీ-2023) నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డెబిట్/క్రెడిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించవచ్చు. పరీక్ష షెడ్యూలును త్వరలోనే వెల్లడించనున్నారు.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2023 నోటిఫికేషన్ మార్చి 17న వెలువడిన సంగతి తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభమైంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.650 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది.
ఐసెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
టీఎస్ ఐసెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'టీఎస్ ఐసెట్-2023' దరఖాస్తు ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. ఐసెట్-2023 దరఖాస్తు ప్రక్రియ మార్చి 6 నుంచి మే 6 వరకు కొనసాగనుంది. విద్యార్థులు రూ.250 ఆలస్య రుసుముతో మే 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు మే 12 నుంచి 18 వరకు అవకాశం కల్పించనున్నారు. మే 22 నుంచి ఐసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 26, 27 తేదీల్లో ఐసెట్ ప్రవేశపరీక్షలు నిర్వహించనున్నారు.
ఐసెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..