అన్వేషించండి

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

ఏపీ ఐసెట్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభమైంది. అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోచ్చు. దరఖాస్తు ఫీజును ఓసీలకు రూ.650, బీసీలకు రూ.600; ఎస్సీ, ఎస్టీలకు రూ.550గా నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2023 నోటిఫికేషన్ మార్చి 17న వెలువడిన సంగతి తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభమైంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.650 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది.

రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 నుంచి 26 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు, రూ.3000 ఆలస్య రుసుముతో మే 4 నుంచి మే 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో మే 11 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మే 16, 17 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. ఐసెట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 20 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 24, 25 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.  

వివరాలు..

* ఏపీ ఐసెట్-2023 

కోర్సుల వివరాలు..

1) ఎంసీఏ

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీసీఏ, బీఎస్సీ-కంప్యూటర్స్, బీకామ్, బీఏ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

2) ఎంబీఏ

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకామ్/ బీబీఏ/ బీబీఎం/ బీసీఏ/ బీఈ/ బీటెక్/ బీఫార్మసీ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

వయోపరిమితి: 19 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయసు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఐసెట్ ర్యాంకు ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.650 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చెల్లిస్తే సరిపోతుంది. 

పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: కమ్యూనికేషన్  ఎబిలిటీ-70 ప్రశ్నలు-70 మార్కులు, సెక్షన్-సి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-55 ప్రశ్నలు-55 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు (రెండున్నర గంటలు).

ఏపీ ఐసెట్-2023 ముఖ్యమైన తేదీలు: 

➽ ఏపీఐసెట్-2023  నోటిఫికేషన్:  మార్చి 17న 

➽ దరఖాస్తులు స్వీకరణ: మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు. 

➽ రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: ఏప్రిల్ 20 నుంచి 26 వరకు. 

➽ రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు. 

➽ రూ.3000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: మే 4 నుంచి 10 వరకు. 

➽ రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: మే 11 నుంచి 15 వరకు. 

➽ పరీక్ష హాల్‌టికెట్లు: మే 20 నుంచి అందుబాటులో. 

➽ ఏపీ ఐసెట్ పరీక్ష నిర్వహణ: మే 24, 25 తేదీల్లో.

Notification

Online Application

Also Read:

TS ICET 2023: టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'టీఎస్ ఐసెట్-2023' దరఖాస్తు ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. ఐసెట్-2023 దరఖాస్తు ప్రక్రియ మార్చి 6 నుంచి  మే 6 వరకు కొనసాగనుంది.  విద్యార్థులు రూ.250 ఆలస్య రుసుముతో మే 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు మే 12 నుంచి 18 వరకు అవకాశం కల్పించనున్నారు. మే 22 నుంచి ఐసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 26, 27 తేదీల్లో ఐసెట్ ప్రవేశపరీక్షలు నిర్వహించనున్నారు.  
ఐసెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


టీఎస్ ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! చివరితేది ఎప్పుడంటే?
టీఎస్ ఎంసెట్-2023 (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023) దరఖాస్తు ప్రక్రియ మార్చి 3న ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్‌ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.250 - రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
ఎంసెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

ఏపీ ఈఏపీసెట్‌-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సు్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఈఏపీసెట్-2023 నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 2023 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చర్/ హార్టికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ/ ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 11 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు మే 15 నుంచి 18 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
ఏపీ ఈఏపీ సెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Sriram: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

MS Dhoni IPL 2024 Retirement | మహేంద్ర సింగ్ ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజనా.? | ABP DesamSRH Captain Pat Cummins IPL 2024 | కమిన్స్ రాకతోనైనా ఆరెంజ్ ఆర్మీ ఆకట్టుకుంటుందా.? | ABP DesamPinkvilla Screen And Style Awards: ముంబయిలో ఘనంగా జరిగిన అవార్డుల వేడుక, విభిన్న డ్రెస్సుల్లో తారలుRajamouli Mahesh Babu Movie: జపాన్ లో RRR స్క్రీనింగ్స్ సందర్భంగా మహేష్ మూవీ అప్డేట్ ఇచ్చిన జక్కన్న

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Sriram: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
Home Loan: క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
South Costal Politics: వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని - ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన
మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని - ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన
Rajamouli On SSMB29: మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
Embed widget