AP EAPCET 2023 Application: ఏపీ ఈఏపీసెట్-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
అర్హులైన అభ్యర్థులు మార్చి 11 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు మే 15 నుంచి 18 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సు్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఈఏపీసెట్-2023 నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 2023 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్/ హార్టికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ/ ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 11 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు మే 15 నుంచి 18 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ ఏడాది ఏపీఈఏపీ సెట్ పరీక్షను జేఎన్‌టీయూ-అనంతపురం నిర్వహించనుంది.
రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. రూ.1000 ఆలస్య రుసుముతో మే 1 నుంచి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో మే 6 నుంచి 12 వరకు, రూ.10,000 ఆలస్య రుసుముతో మే 13 నుంచి 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల్లో సవరణకు మే 4 నుంచి 6 వరకు అవకాశం కల్పించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 7 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. మే 15 నంచి 18 వరకు ఎంపీసీ స్ట్రీమ్ విభాగాలకు పరీక్ష నిర్వహిస్తారు. అలాగే మే 22, 23 తేదీల్లో బైపీసీ స్ట్రీమ్ విభాగాలకు పరీక్ష నిర్వహిస్తారు.
వివరాలు..
* ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (ఏపీ ఈఏపీసెట్)
ప్రవేశాలు కల్పించే కోర్సులు:
➥ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, బీటెక్(డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)
➥ బీఎస్సీ(అగ్రికల్చర్), బీఎస్సీ(హార్టికల్చర్), బీవీఎస్సీ &ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ
➥ బీఫార్మసీ, ఫార్మా-డి.
అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఎంపీసీ/ బైపీసీ) లేదా ఇంటర్ ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా డిప్లొమా(ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్‌లో 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి..
➥ ఇంజినీరింగ్, ఫార్మసీ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 31.12.2023 నాటికి 16 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.
➥ఫార్మా-డి పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 31.12.2023 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు..
➥ ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాలకు దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఇక బీసీ అభ్యర్థులు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
➥ రెండు విభాగాలకూ దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200 చెల్లించాలి. ఇక బీసీ అభ్యర్థులు రూ.1100, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు...
➥ నోటిఫికేషన్ వెల్లడి: 10.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2023
➥ రూ.500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2023
➥ రూ.1000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.05.2023
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 04.05.2023 to 06.05.2023.
➥ రూ.5000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.05.2023.
➥ రూ.10,000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 14.05.2023.
➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 09.05.2023.
➥ ఏపీఈఏపీ సెట్-ఎంపీసీ స్ట్రీమ్ (ఇంజినీరింగ్) విభాగాలకు: మే 15 నంచి 18 వరకు.
➥ ఏపీఈఏపీ సెట్-బైపీసీ స్ట్రీమ్ (అగ్రికల్చర్ & ఫార్మసీ) విభాగాలకు: మే 22, 23 తేదీల్లో.
➥ పరీక్ష సమయం: ఉ.9 గం.- మ. 12 గం. వరకు, మ.3 గం.-సా.6 గం. వరకు.
➥ ప్రిలిమినరీ కీ: 24.05.2023 9.00 am.
➥ ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 24.05.2023 9.00 am - 26.05.2023 9.00 am