అన్వేషించండి

Telangana Municipal Elections 2026: తెలంగాణలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభం

Telangana local body elections 2026 | తెలంగాణలో 7 నగర పాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికలు బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పర్వం ఉత్సాహంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థల పరిధిలో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఈ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈసారి పురుష ఓటర్ల (25,49,750) కంటే మహిళా ఓటర్ల (26,67,025) సంఖ్యే అధికంగా ఉంది. ఇతరులు 638 మంది ఓటర్లుగా నమోదయ్యారు.

2,981 స్థానాలకు 12,944 మంది పోటీ

ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే, 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డులకు గానూ 12 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. అలాగే, మక్తల్ మున్సిపాలిటీలోని ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడటంతో, ప్రస్తుతం 2,569 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. మున్సిపాలిటీల్లో 10,719 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరోవైపు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 414 డివిజన్లలో రెండు చోట్ల ఏకగ్రీవం కావడంతో, మిగిలిన 412 స్థానాలకు 2,225 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తంగా 2,981 స్థానాలకు 12,944 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. మున్సిపాలిటీల్లో 6,017 మరియు కార్పొరేషన్లలో 2,174 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ భారీ ఎన్నికల ప్రక్రియలో 41,773 మంది పోలింగ్ సిబ్బందితో పాటు 1,379 మంది రిటర్నింగ్ అధికారులు పాలుపంచుకుంటున్నారు. భద్రత కోసం పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ముఖ్యంగా సమస్యాత్మకమైన 8,191 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతరం నిఘా ఉంచినట్లు ఎస్‌ఈసీ కార్యదర్శి లింగ్యా నాయక్ వెల్లడించారు.

మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. రాష్ట్ర ప్రభుత్వం సెలవు 

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు (బుధవారం, ఫిబ్రవరి 11) జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పోలింగ్ ప్రాంతాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సెలవు కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం కాకుండా, ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని అన్ని ఫ్యాక్టరీలు, షాపులు, పరిశ్రమలు, ఇతర వాణిజ్య సంస్థలకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులకు ఇది 'పెయిడ్ హాలిడే' (వేతనంతో కూడిన సెలవు)గా పరిగణిస్తారు. తద్వారా ప్రతి ఒక్కరూ తమ స్థానిక ఎన్నికల్లో భాగస్వాములు కానున్నారు. 

అయితే, ఈ సెలవు నిర్ణయం కేవలం ఎన్నికలు నిర్వహిస్తున్న పట్టణ స్థానిక సంస్థల (ULBs) సరిహద్దులకు మాత్రమే పరిమితం చేశారు. ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులందరూ ఖచ్చితంగా పోలింగ్‌లో పాల్గొని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని అధికారులు కోరుతున్నారు. ఓటరు స్లిప్పులు, గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి బాధ్యతగా ఓటు వేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Musi Riverfront Development Project:మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
Preethi Reddy Politics: మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి రాజకీయ దూకుడు - బీఆర్ఎస్ కాదు బీజేపీ వైపే చూస్తున్నారా?
మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి రాజకీయ దూకుడు - బీఆర్ఎస్ కాదు బీజేపీ వైపే చూస్తున్నారా?
Telugu Innovation: రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
Advertisement

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikakulam Latest News: ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
Kakinada Latest News:కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
Ram Gopal Varma : అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
Iran Warns US: ఖార్గ్ ద్వీపంపై దాడి తర్వాత రగిలిపోతున్న ఇరాన్! చమురు ఉత్పత్తి కేంద్రాలను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక! 
ఖార్గ్ ద్వీపంపై దాడి తర్వాత రగిలిపోతున్న ఇరాన్! చమురు ఉత్పత్తి కేంద్రాలను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక! 
Jason Sanjay: దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?
దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?
Pithapuram Latest News: చంద్ర‌బాబుకే గుర్తింపు లేదంటే ఇక మా ప‌రిస్థితేంటి? పిఠాపురంలో వర్మకు మళ్లీ కోపమొచ్చింది! 
చంద్ర‌బాబుకే గుర్తింపు లేదంటే ఇక మా ప‌రిస్థితేంటి? పిఠాపురంలో వర్మకు మళ్లీ కోపమొచ్చింది! 
Vijay Sethupathi: 200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ... విజయ్ సేతుపతి ఏం చెప్పారంటే?
200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ... విజయ్ సేతుపతి ఏం చెప్పారంటే?
Dhanush D56 Movie : ధనుష్ మూవీలో డ్రాగన్ బ్యూటీ? - క్రేజీ ఆఫర్ కొట్టేసిందిగా...
ధనుష్ మూవీలో డ్రాగన్ బ్యూటీ? - క్రేజీ ఆఫర్ కొట్టేసిందిగా...
Embed widget