అన్వేషించండి

Andhra Coalition Politics: కల్తీ నెయ్యి ఇష్యూలో అంటీముట్టనట్లుగా బీజేపీ - టీడీపీ, జనసేనలదే పోరాటం - ఎందుకిలా ?

Adulterated ghee Politics: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్త సంచలనం సృష్టించింది. హిందూ ధర్మ పరిరక్షణ తమ బాధ్యతగా చెప్పుకునే బీజేపీ టీడీపీ, జనసేనల కంటే వెనుకబడింది. ఎందుకని?

BJP ignore adulterated ghee issue:  తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తున్న తీరు, దీనిపై బీజేపీ నేతల మౌనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.   రాజమండ్రి జైలు వద్ద మీడియాలో మాట్లాడిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలాన్నిచ్చాయి. లడ్డూ కల్తీపై చంద్రబాబు విపరీతంగా స్పందిస్తున్నారని, కానీ హిందూత్వానికి పేటెంట్ ఉన్నట్లు భావించే బీజేపీ నేతలు కూడా అలా మాట్లాడటం లేదని ఆయన విశ్లేషించారు. ఇలాంటి అభిప్రాయం ఇప్పటికే రాజకీయవర్గాల్లో ఉంది.  

హిందూత్వ అంశంలో ముందుగా స్పందించే బీజేపీ                       

సాధారణంగా హిందూ ధర్మం, దేవాలయాల పరిరక్షణ అనే అంశాలు రాగానే బీజేపీ అగ్రనేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు అందరూ ఉవ్వెత్తున స్పందిస్తుంటారు.  శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జ్ జరిగిందన్న వార్త రాగానే బీజేపీ నేత మాధవ్ తక్షణమే స్పందించారు. కానీ, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న, అత్యంత ఘోరమైన అపచారంగా భావిస్తున్న లడ్డూ కల్తీ విషయంలో మాత్రం బీజేపీ స్పందన నామమాత్రంగానే ఉండటం గమనార్హం. జాతీయ మీడియాలో ఈ అంశంపై భారీ చర్చ జరుగుతున్నా, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఆందోళనలకు గానీ, బలమైన నిరసనలకు గానీ పిలుపునివ్వలేకపోయారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అగ్రెసివ్ ప్లాన్ 

లడ్డూ కల్తీ అంశాన్ని కేవలం ఒక అవినీతి కేసుగా కాకుండా, కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్‌గా మార్చడంలో టీడీపీ, జనసేన అగ్రనేతలు సఫలమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ప్రతి వేదికపై ఈ అపచారాన్ని ఎండగడుతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  కూడా ఈ అంశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ మాత్రం ఈ క్రెడిట్ అంతా తమ మిత్రపక్షాల ఖాతాలోకి వెళ్తున్నా, ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతోంది. 

బీజేపీ మౌనం వెనుక మర్మమేంటి?                      

చంద్రబాబు ప్రత్యేకంగా బీజేపీ నేతలను పిలిపించి మాట్లాడించిన తర్వాత కూడా వారిలో ఆశించిన స్థాయిలో చలనం కనిపించడం లేదు. హిందూ ధర్మానికి అపచారం జరుగుతున్నా, బీజేపీ నేతలు ఎందుకు ఈ అంశంతో తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై అప్పుడు గళమెత్తిన బీజేపీ, ఇప్పుడు ఇంత పెద్ద ఆధారాలు బయటపడుతున్నా గట్టిగా మాట్లాడలేకపోవడానికి కారణం ఏమిటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.  బీజేపీ నేతల ఈ ఉదాసీన వైఖరి ఇప్పుడు విపక్షాలకు అస్త్రంగా మారుతోంది.  జాతీయ స్థాయిలో ఈ అంశంపై విచారణకు మొగ్గు చూపుతున్న కేంద్ర పెద్దలు, రాష్ట్ర స్థాయిలో మాత్రం స్థానిక నేతలను  కట్టడి చేస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అది రాజకీయ వ్యూహమా లేకపోతే ఇంకేదైనా కారణమా అన్నది కూటమిలోని ఇతర పార్టీలకు అంతు చిక్కడం లేదు.                 


 

టాప్ హెడ్ లైన్స్

Telangana Power Crisis: తెలంగాణలో కరెంట్ కష్టాలు - రూ.5,420 కోట్ల ట్రూ-అప్ షాక్ - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోగలదా?
తెలంగాణలో కరెంట్ కష్టాలు - రూ.5,420 కోట్ల ట్రూ-అప్ షాక్ - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోగలదా?
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
TDP Janasena Seat Sharing: స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం..
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం..
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Embed widget