(Source: ECI/ABP News/ABP Majha)
New Educaiton Policy: ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్‌లపై దృష్టి పెట్టండి - పరిశ్రమలు, విద్యాసంస్థలకు ప్రధాని మోదీ పిలుపు!
దేశంలో ఇప్పటి వరకు సంక్లిష్టంగా ఉన్న విద్యా విధానాన్ని సులభతరం చేయడానికి నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చినట్లు మోదీ వెల్లడించారు. విద్యకు, నైపుణ్య శిక్షణకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
భారతీయ విద్యావ్యవస్థను భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా నూతన విద్యా విధానం పునర్ నిర్వచించిందని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 25న ''యువశక్తి వినియోగం - నిపుణత, విద్య'' పేరుతో నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధాని ప్రసంగించారు. దేశంలో ఇప్పటి వరకు సంక్లిష్టంగా ఉన్న విద్యా విధానాన్ని సులభతరం చేయడానికి నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చినట్లు మోదీ వెల్లడించారు.
నూతన విద్యా విధానంలో విద్యకు, నైపుణ్య శిక్షణకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఎక్కడి నుంచైనా విద్యార్థులు జ్ఞానాన్ని ఆర్జించేలా నూతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల పాత్ర తరగతి గదులకే పరిమితం కారాదని దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని శోధించి బోధించడం ద్వారా గ్రామీణ, పట్టణ పాఠశాలల మధ్య ఉన్న అంతరాలను తగ్గించడానికి కృషి చేయాలని సూచించారు.
ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్‌లపై దృష్టి పెట్టండి
జాతీయ ఇంటర్న్‌షిప్ పోర్టల్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించాలని పరిశ్రమవర్గాలకు, విద్యాసంస్థలకు ప్రధాని మోదీ సూచించారు. ఈ పోర్టల్‌లో ప్రస్తుతం 75 వేల సంస్థలు నమోదై ఉండగా అవి ఇప్పటి వరకు 25 లక్షల ఇంటర్న్‌షిప్‌లను ప్రకటించాయని వెల్లడించారు. జాతీయ అప్రెంటిస్‌షిప్ ప్రోత్సాహక పథకం కింద 50 లక్షల మంది యువతకు స్టైపెండ్ ఇవ్వడానికి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు గుర్తుచేశారు.
ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 పథకం
ప్రపంచం భారత్‌ను తయారీరంగ కేంద్రంగా భావిస్తున్న ఈ దశలో ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 పథకం లక్షల మంది యువతీయువకులను నిపుణులుగా మార్చనుందని ప్రకటించారు. కృత్రిమ మేధ, ఐఓటీ, రోబోటిక్స్, డ్రోన్ సాంకేతికతల్లో సుశిక్షుతులైన యువతను తయారు చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. పరిశోధనల్లో ప్రైవేటు రంగం పెద్దన్న బాధ్యతను తీసుకోవాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
Also Read:
నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్- 2023 నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష ఎప్పుడంటే?
భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్ (నైసర్), యూనివర్సిటీ ఆఫ్ ముంబయి ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్) సంస్థల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్) 2023' నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..