అన్వేషించండి

TS EAPCET - 2024 హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్, డౌన్‌లోడ్ ఎప్పటినుంచంటే? పరీక్ష వివరాలు ఇలా

తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలకు నిర్దేశించిన 'టీఎస్ ఎప్‌సెట్-2024' అడ్మిట్ కార్డులు ఏప్రిల్ 29 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

TS EAPCET 2024 Halltickets: తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలకు నిర్దేశించిన 'టీఎస్ ఎప్‌సెట్-2024' అడ్మిట్ కార్డులు ఏప్రిల్ 29 నుంచి అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఎప్‌సెట్ దరఖాస్తు గడువు ముగియగా..  రూ.5000 ఆల‌స్య రుసుముతో మే 1 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోలేనివారు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇక ఇదే చివరి అవకాశం. 

➥ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 7 నుంచి 11 వరకు ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా విభాగాలకు;  మే 9, 10, 11వ తేదీల్లో ఇంజినీరింగ్‌ విభాగానికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మొదటి సెషన్‌లో, మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించ‌నున్నారు.

➥ ఇంటర్ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో ఎప్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉర్దూ మీడియం వారికి చివరి రోజు అయిన మే 12న పరీక్ష ఉంటుందని, వీరికి ఉర్దూ/ఇంగ్లిష్‌ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు.  

వివరాలు…

➥  తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ - టీఎస్‌ఎప్‌సెట్ (TS EAPCET) - 2024

అర్హత: ఇంటర్మీడియట్‌(ఎంపీసీ/ బైపీసీ)లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి. అగ్రికల్చర్ సంబంధిత కోర్సులకు సంబంధించి డిప్లొమా చివరిసంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 31.12.2024 నాటికి ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులకు 16 సంవత్సరాలలోపు ఉండాలి. అగ్రికల్చర్ సంబంధిత కోర్సులకు 17 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

రిజిస్ట్రేషన్ ఫీజు: ఇంజినీరింగ్ (లేదా) అగ్రికల్చర్ & ఫార్మా పరీక్షల్లో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. ఇక రెండు విభాగాలకు (ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా) దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్/ బయాలజీ నుంచి 80 ప్రశ్నలు- 80 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు. ప్రతిప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు. ఇంటర్ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో ఎప్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉర్దూ మీడియం వారికి చివరి రోజు అయిన మే 12న పరీక్ష ఉంటుందని, వీరికి ఉర్దూ/ఇంగ్లిష్‌ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. 

పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 

ప్రవేశాలు కల్పించే కోర్సులు..

విభాగం కోర్సులు
ఇంజినీరింగ్ బీఈ/ బీటెక్‌, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (బయో-టెక్నాలజీ), బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్‌(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (ఎంపీసీ),
ఫార్మా-డి (ఎంపీసీ)
అగ్రికల్చర్ & ఫార్మసీ బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ(ఫారెస్ట్రీ), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ, బీటెక్‌(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (బైపీసీ), ఫార్మ్-డి (బైపీసీ)


TS EAPCET - 2024 Detailed Notification

Pay Registration Fee 

Fill Online Application

Print Filled-in Application

Know Your Fee Payment Status

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh Comments: ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం: నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం: నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
Telangana CEO Vikas Raj: నేడు తెలంగాణలో 38 కేసులు నమోదు, భారీ బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్స్‌కు ఈవీఎంలు: వికాస్ రాజ్
నేడు తెలంగాణలో 38 కేసులు నమోదు, భారీ బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్స్‌కు ఈవీఎంలు: వికాస్ రాజ్
AP Election 2024 Polling Percentage: ఏపీలో ముగిసిన పోలింగ్, ఉద్రిక్త ఘటనలు 120కి పైనే! ఓటింగ్ శాతం ఎంతంటే
ఏపీలో ముగిసిన పోలింగ్, ఉద్రిక్త ఘటనలు 120కి పైనే! ఓటింగ్ శాతం ఎంతంటే
Telangana Elections 2024 ends: తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5 వరకు 61 శాతం ఓటింగ్
తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5 వరకు 61 శాతం ఓటింగ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KA Paul Casts His Vote | విశాఖలో ఓటు హక్కు వినియోగించుకున్న కేఏ పాల్ | ABP DesamTenali MLA Annabathuni Siva Slap Video | ఓటర్ ను కొట్టిన అన్నా బత్తుని శివ కుమార్..! | ABP DesamStone Fight Between YSRCP TDP in Tadipatri | తాడిపత్రిలో రాళ్లతో కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు | ABP DesamMadhavi latha Ask Muslim Women to Prove Identity | ముస్లిం మహిళలను బుర్ఖా తీయాలన్న మాధవీలత | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Comments: ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం: నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం: నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
Telangana CEO Vikas Raj: నేడు తెలంగాణలో 38 కేసులు నమోదు, భారీ బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్స్‌కు ఈవీఎంలు: వికాస్ రాజ్
నేడు తెలంగాణలో 38 కేసులు నమోదు, భారీ బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్స్‌కు ఈవీఎంలు: వికాస్ రాజ్
AP Election 2024 Polling Percentage: ఏపీలో ముగిసిన పోలింగ్, ఉద్రిక్త ఘటనలు 120కి పైనే! ఓటింగ్ శాతం ఎంతంటే
ఏపీలో ముగిసిన పోలింగ్, ఉద్రిక్త ఘటనలు 120కి పైనే! ఓటింగ్ శాతం ఎంతంటే
Telangana Elections 2024 ends: తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5 వరకు 61 శాతం ఓటింగ్
తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5 వరకు 61 శాతం ఓటింగ్
CBSE 10th result 2024: 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
CBSE 10th result 2024: 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
AP Election 2024 Polling Percentage: ఏపీలో 6 నియోజకవర్గాల్లో ముగిసిన ఓటింగ్, సాయంత్రం 5 వరకు 68 శాతం పోలింగ్ నమోదు
ఏపీలో 6 నియోజకవర్గాల్లో ముగిసిన ఓటింగ్, సాయంత్రం 5 వరకు 68 శాతం పోలింగ్ నమోదు
Tender vote : సర్కారు సినిమాలో విజయ్‌ లెక్క ఓటు వేసిన మహిళ- మీ ఓటు లేకపోతే ఇలా చేయొచ్చు !
సర్కారు సినిమాలో విజయ్‌ లెక్క ఓటు వేసిన మహిళ- మీ ఓటు లేకపోతే ఇలా చేయొచ్చు !
TS Election 2024 Voting updates: తెలంగాణలో సమస్యల పరిష్కారం కాలేదని పోలింగ్ బహిష్కరించిన పలు గ్రామాలు
తెలంగాణలో సమస్యల పరిష్కారం కాలేదని పోలింగ్ బహిష్కరించిన పలు గ్రామాల ప్రజలు
Embed widget