అన్వేషించండి

DOST Admissions: 'దోస్త్'లకు సీట్ల కేటాయింపు, తొలి విడతలో 73,220 మందికి ప్రవేశాలు!

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల‌కు సంబంధించి విద్యార్థులకు 'దోస్త్' తొలిదశ సీట్లను కేటాయించారు. మొద‌టి విడత‌లో 73,220 మంది సీట్లు కేటాయించిన‌ట్లు ఉన్నత విద్యామండ‌లి ప్రకటించింది..

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల‌కు సంబంధించి విద్యార్థులకు 'దోస్త్' తొలిదశ సీట్లను కేటాయించారు. మొద‌టి విడత‌లో 73,220 మంది సీట్లు కేటాయించిన‌ట్లు ఉన్నత విద్యామండ‌లి జూన్ 16న ఒక ప్రకటనలో తెలిపింది. సీట్లు పొందిన విద్యార్థుల్లో 44,113 మంది అమ్మాయిలు, 29,107 మంది అబ్బాయిలు ఉన్నారు. దోస్త్‌ ద్వారా ప్రవేశాలకు అందుబాటులో 889 కళాశాలలు ఉండగా.. వాటిల్లో  మొత్తం సీట్లు 3,56,258 సీట్లు ఉన్నాయి. ఇక 63 కళాశాలల్లో ఎలాంటి ప్రవేశాలు జరుగలేదు. డిగ్రీ కామ‌ర్స్ కోర్సుల్లో చేరేందుకే విద్యార్థులు సుముఖ‌త చూపించడం విశేషం. మొత్తం 33,251 మంది విద్యార్థులు కామ‌ర్స్ కోర్సుల‌ను ఎంపిక చేసుకున్నారు. సీట్లు పొందిన విద్యార్థుల జూన్ 16 నుంచి 25 వరకు సంబంధిత కళాశాలల్లో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16న ప్రారంభమైన 'దోస్త్' ప్రక్రియ జులై 10 వరకు కొనసాగనుంది. మొత్తం మూడు విడతలుగా ప్రవేశాలను కల్పిస్తారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత జులై 17 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగిన నేపథ్యంలో.. తర్వాతి  రెండు, మూడో విడతలో రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

మొత్తం మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. మే 16 నుంచి జూన్ 10 వరకు దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించారు. రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన విద్యార్థులకు మే 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. వీరికి జూన్ 16న మొదటి విడత డిగ్రీ సీట్లను కేటాయించారు.

జూన్ 16 నుంచి  26 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు..

'దోస్త్' రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్ 16న ప్రారంభమైంది. జూన్ 26 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక రెండో విడత వెబ్ ఆప్షన్లకు జూన్ 16 నుంచి 27 వరకు అవకాశం కల్పించనున్నారు. విద్యార్థులకు జూన్ 30న రెండో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.

➥ ఇక మూడో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను జులై 1 నుంచి 5 వరకు నిర్వహించనున్నారు. జులై 1 నుంచి 6 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. విద్యార్థులకు జులై 10న మూడో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు. జులై 17 నుంచి డిగ్రీ మొదటి విడత సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని దోస్త్ కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు.

రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో 1054 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్‌ దోస్త్‌ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేష‌న‌ల్, బీకాం హాన‌ర్స్, బీఎస్‌డ‌బ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇత‌ర కోర్సులకు సంబంధించి మొత్తం 4,73,214 సీట్లు ప్రతీ ఏటా ఉండేవి. అయితే ప్రతీ ఏడాది 2 లక్షల నుంచి 2.50 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. కొన్ని కాలేజీల్లో జీరో అడ్మిషన్లు, మరికొన్ని కాలేజీల్లో 15 శాతం లోపే ప్రవేశాలు జరిగేవి. దీంతో కాలేజీలు కోర్సులను నడపలేకపోతున్న నేపథ్యంలో హేతుబద్ధీకరణ చేపట్టి 86,670 సీట్లను గతేడాదిలోనే ఫ్రీజ్‌ చేశారు. 

'దోస్త్' నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

Website

టాప్ హెడ్ లైన్స్

Adilabad News: తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive
తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive
UK Student Visa Rules: ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!
ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!
NEET PG Exam 2026: మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది
మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది
NEET PG Exam: నీట్ పీజీ ఎగ్జామ్, మారథాన్ నిర్వహణ.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
నీట్ పీజీ ఎగ్జామ్, మారథాన్ నిర్వహణ.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్
Vijay TVK: విజయ్‌ను నడిపిస్తోంది ముగ్గురు తెలుగు స్నేహితులేనా? - ఆ రెడ్డి బ్రదర్స్‌ను డీఎంకే ఎందుకు టార్గెట్ చేస్తోంది?
విజయ్‌ను నడిపిస్తోంది ముగ్గురు తెలుగు స్నేహితులేనా? - ఆ రెడ్డి బ్రదర్స్‌ను డీఎంకే ఎందుకు టార్గెట్ చేస్తోంది?
Visakhapatnam Latest News: విశాఖలో స్లం రీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.. పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం- ఏపీలో తొలి ప్రాజెక్టు
విశాఖలో స్లం రీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.. పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం- ఏపీలో తొలి ప్రాజెక్టు
Hyderabad Common Travel Pass: త్వరలో హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రోకు కలిపి ఒకటే పాస్.. ఛార్జీల పూర్తి వివరాలు
త్వరలో హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రోకు కలిపి ఒకటే పాస్.. ఛార్జీల పూర్తి వివరాలు
TDP Janasena Social Media Warning : ఈగోలు వర్సెస్ పొత్తు ధర్మం - టీడీపీ-జనసేన అధినేతల హెచ్చరికలతో ఆ సోషల్ సైన్యాలు దారికి వస్తాయా?
ఈగోలు వర్సెస్ పొత్తు ధర్మం - టీడీపీ-జనసేన అధినేతల హెచ్చరికలతో ఆ సోషల్ సైన్యాలు దారికి వస్తాయా?
Vizianagaram Politics: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన చిన్న శ్రీను- మేనమామ బొత్స చేసిన ప్రకటనే కారణమా?
వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన చిన్న శ్రీను- మేనమామ బొత్స చేసిన ప్రకటనే కారణమా?
Chandrababu: డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
Historic IND VS JPN Clash: వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
Embed widget