అన్వేషించండి

DOST 2023: డిగ్రీ ప్రవేశాలకు 'దోస్త్‌' నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్ ప్రవేశాలకు 'దోస్త్' నోటిఫికేషన్‌ వెలువడింది. దోస్త్ కన్వీనర్ లింబాద్రి మే 11న దోస్త్ షెడ్యూలును ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్ ప్రవేశాలకు 'దోస్త్' నోటిఫికేషన్‌ వెలువడింది. మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి‌ కార్యాలయంలో గురువారం (మే 11) డిగ్రీ దోస్త్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కళాశాల విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి నాలుగేళ్ల బీఎస్సీ(ఆనర్స్‌) కోర్సును ప్రవేశ పెడుతున్నారు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16 నుంచి జులై 10 వరకు దోస్త్ ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం మూడు విడతలుగా ప్రవేశాలను కల్పిస్తారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత జులై 17 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. విద్యార్థులు మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని, రెండు, మూడో విడుతలో రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 

రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో 1054 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్‌ దోస్త్‌ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేష‌న‌ల్, బీకాం హాన‌ర్స్, బీఎస్‌డ‌బ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇత‌ర కోర్సులకు సంబంధించి మొత్తం 4,73,214 సీట్లు ప్రతీ ఏటా ఉండేవి. అయితే ప్రతీ ఏడాది 2 లక్షల నుంచి 2.50 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. కొన్ని కాలేజీల్లో జీరో అడ్మిషన్లు, మరికొన్ని కాలేజీల్లో 15 శాతం లోపే ప్రవేశాలు జరిగేవి. దీంతో కాలేజీలు కోర్సులను నడపలేకపోతున్న నేపథ్యంలో హేతుబద్ధీకరణ చేపట్టి 86,670 సీట్లను గతేడాదిలోనే ఫ్రీజ్‌ చేశారు. దీంతో 3.86 లక్షల సీట్లకే ప్రవేశాలు కల్పించనున్నారు.

షెడ్యూలు ఇలా..

➥ మొత్తం మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. మే 16 నుంచి జూన్ 10 వరకు దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన విద్యార్థులకు మే 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. జూన్ 16న మొదటి విడత డిగ్రీ సీట్లను కేటాయించనున్నారు. 

➥ రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్ 16 నుంచి 26 వరకు కొనసాగనుంది. రెండో విడత వెబ్ ఆప్షన్లకు జూన్ 16 నుంచి 27 వరకు అవకాశం కల్పించనున్నారు. విద్యార్థులకు జూన్ 30న రెండో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.

➥ మూడో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను జులై 1 నుంచి 5 వరకు నిర్వహించనున్నారు. జులై 1 నుంచి 6 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. విద్యార్థులకు జులై 10న మూడో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు. జులై 17 నుంచి డిగ్రీ మొదటి విడత సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని దోస్త్ కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు.

Website

Also Read:

‘సింగిల్‌ స్పెషల్‌’ డిగ్రీ! ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి!
ఏపీలోని డిగ్రీ కళాశాలల్లో 'సింగిల్‌ సబ్జెక్టు' మేజర్‌గా కొత్త కరిక్యులమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు డిగ్రీలో మూడు సబ్జెక్టులు ప్రధాన కాంబినేషన్‌తో విద్యాబోధన సాగుతుండగా ఇకపై ఒక మేజర్‌ సబ్జెక్టు ప్రధానంగా డిగ్రీ విద్య కొనసాగనుంది. జూన్‌ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది. ఈ మేరకు కరిక్యులమ్‌లో మార్పులు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం (మే 10)  చైర్మన్‌ ఫ్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ రామ్మోహన్‌రావు మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ‘సెట్స్‌’ స్పెషల్‌ ఆఫీసర్‌ సుధీర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్‌ అహ్మద్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

'సింగిల్‌ సబ్జెక్టు' కోర్సులకు నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా..
ఏపీలోని డిగ్రీ కాలేజీల్లో రానున్న విద్యాసంవత్సరం (2023-24) నుంచి సింగిల్ సబ్జెక్టు డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న మూడు ప్రధాన సబ్జెక్టుల కోర్సుల నుంచి సింగిల్‌ సబ్జెక్టుకు మారేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ప్రాసెస్‌ ఫీజు కింద ఒక్కో కళాశాల రూ.5 వేలు చెల్లించాలని, పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget