DOST Admissions: 'దోస్త్' తొలి విడత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, ప్రవేశాల పూర్తి షెడ్యూలు ఇలా
DOST: తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాలకు సంబంధించి దోస్త్ మొదటి విడత ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ మే 6న ప్రారంభమైంది. మే 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
DOST 2024 Application: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాలకు సంబంధించి దోస్త్ (DOST - Degree Online Services Telangana) మొదటి విడత ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ మే 6న ప్రారంభమైంది. మే 25 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన విద్యార్థులకు మే 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జూన్ 3న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 4 నుంచి 10 మధ్య సంబంధిత కళాశాలలో సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
విద్యార్థులు మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం 'దోస్త్' ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దోస్త్ పరిధిలో రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో 1054 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్ దోస్త్ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్ ద్వారా భర్తీచేస్తారు.
మొత్తం మూడు విడతలుగా ప్రవేశాలను కల్పించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 6 నుంచి 25 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు నిర్వహించి జూన్ 3న సీట్లను కేటాయించనున్నారు. జూన్ 4 నుంచి 13 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు నిర్వహించి జూన్ 18న సీట్లను కేటాయిస్తారు. ఇక చివరి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూన్ 19 నుంచి 25 వరకు నిర్వహించి.. జూన్ 29న సీట్లను కేటాయిస్తారు.
'దోస్త్' మొదటి దశ ప్రవేశాలు ఇలా..
➥ మే 6 నుంచి 25 వరకు దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
➥ రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన విద్యార్థులకు మే 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు.
➥ విద్యార్థులకు జూన్ 3న మొదటి విడత డిగ్రీ సీట్లను కేటాయించనున్నారు.
➥ సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 4 నుంచి 10 మధ్య సంబంధిత కళాశాలలో సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
'దోస్త్' రెండో దశ ప్రవేశాలు ఇలా..
➥ రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్ 4 నుంచి 13 వరకు కొనసాగనుంది.
➥ రెండో విడత వెబ్ ఆప్షన్లకు జూన్ 4 నుంచి 14 వరకు అవకాశం కల్పించనున్నారు.
➥ విద్యార్థులకు జూన్ 18న రెండో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.
➥ సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 19 నుంచి 24 మధ్య సంబంధిత కళాశాలలో సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
'దోస్త్' మూడో విడత ప్రవేశాలు ఇలా..
➥ ఇక చివరగా.. జూన్ 19 నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది.
➥ విద్యార్థులు జూన్ 25 వరకు దరఖాస్తులు సమర్పించాలి.
➥ చివరి విడత వెబ్ ఆప్షన్లకు జూన్ 19 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు.
➥ విద్యార్థులకు జూన్ 29న మూడో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.
➥ సీట్లు పొందిన విద్యార్థులు జులై 8లోగా సంబంధిత కళాశాలలో సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
➥ జులై 8 నుంచి కళాశాలల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి.