అన్వేషించండి

CUET PG Admit card: సీయూఈటీ (పీజీ)-2024, మార్చి 22 నాటి పరీక్ష అడ్మిట్‌కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

CUET PG Admit card: ప్రవేశ పరీక్షకు సంబంధించి మార్చి 22న నిర్వహించనున్న పరీక్ష అడ్మిట్‌కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్చి 18న విడుదలచేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

Release of Admit Card for CUET (PG) 2024: దేశవ్యాప్తంగా 142 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) పీజీ - 2024' ప్రవేశ పరీక్షకు సంబంధించి మార్చి 22న నిర్వహించనున్న పరీక్ష అడ్మిట్‌కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్చి 18న విడుదలచేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 11న సీయూఈటీ పీజీ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మార్చి 28 వరకు సీబీటీ పద్ధతిలో సీయూఈటీ పీజీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి మొత్తంగా 4,62,589 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని 327 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ఫలితాలు ఏప్రిల్ నెలాఖరులో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పరీక్ష ఆధారంగా దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తున్నాయి. వీటిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు సైతం ఉన్నాయి.

Download CUET (PG) 2024 Admitcard

పరీక్ష విధానం:

➥ సీయూఈటీ పీజీ పరీక్షను 105 నిమిషాలపాటు సీబీటీ ఆధారంగా నిర్వహిస్తారు. మొత్తం 75 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. సిలబస్ అభ్యర్థి ఎంపిక చేసుకున్న పేపర్ కోడ్ ఆధారంగా మారుతుంటాయి.

➥ సీయూఈటీ పీజీ పరీక్షను రోజుకు మూడు సెషన్ల చెప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 10.45 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 2.30 గంటల వరకు రెండో సెషన్‌లో, సాయంత్రం 4.30 గంటల నుంచి 6.15 గంటల వరకు మూడోసెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టులను అనుచరించి ఆయా సెషన్లలో హాజరుకోవాల్సి ఉంటుంది.

➥ ఎగ్జామ్ డిగ్రీ సిలబస్ ఆధారితంగా ఉంటుంది. స్థానిక భాషలో పరీక్షను రాయాలనుకునే అభ్యర్థులు సొంత రాష్ట్రంలో ఎగ్జామ్ సెంటర్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగులకు అదనపు సమయం కేటాయిస్తారు.

➥ అభ్యర్థులు పరీక్ష సమయానికి 2 గంటల ముందుగానే చేరుకోవాలి. పరీక్ష ఆరంభానికి అరగంట ముందుగానే అభ్యర్థులు హాల్‌టికెట్ల పరిశీలన, పరీక్ష హాల్, బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్, వ్యక్తిగత హాజరు తదితర ప్రక్రియను పూర్తిచేస్తారు. పరీక్షకు 10 నిమిషాల ముందు పరీక్షకు సంబంధించిన నియమ నిబంధనలను లాగిన్ అయి చూసుకోవచ్చు.

CUET (PG) - 2024: సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

తెలగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు...

➥ తెలంగాణ: హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.

➥ ఆంధ్రప్రదేశ్: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

పరీక్షల షెడ్యూలు ఇలా..

CUET PG Exams: సీయూఈటీ పీజీ - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఏ పరీక్ష ఎప్పుడంటే?

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.12.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.02.2024.

➥ ఆన్‌లైన్ ఫీజు చెల్లింపునకు చివరితేది: 10.02.2024.

➥  అడ్వాన్స్‌డ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్: 04.03.2024.

➥ అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: 07.03.2024.

➥ పరీక్ష తేది: 11.03.2024 - 28.03.2024.

➥ ఆన్సర్ కీ వెల్లడి: 04.04.2024.

Notification

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన రైలు, విశాఖ రైల్వే స్టేషన్లో ఘటన- పలు సర్వీసులకు అంతరాయం
విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన రైలు, విశాఖ రైల్వే స్టేషన్లో ఘటన- పలు సర్వీసులకు అంతరాయం
Embed widget