News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

CSIR UGC NET June 2022: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ 2022.. దరఖాస్తుకు కొద్దిరోజులే!

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబరు) ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి.

FOLLOW US: 
Share:

దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్‌ఎఫ్) అర్హత కోసం  'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్' పరీక్ష నిర్వహిస్తున్న సంగతి విదితమే. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబరు) ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి. ఈ ఏడాదికి గాను 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్-జూన్ 2022' దరఖాస్తు గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుంది. జులై 11 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎవరు అర్హులు..?
★ సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ/ తత్సమాన డిగ్రీ ఉండాలి. (లేదా) ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
★ 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి ఎంత..
?
★ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్ఎఫ్) కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 01.07.2021 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు. వయోపరిమితిలో ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంది.
★ లెక్చరర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
?
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.1000; ఓబీసీ అభ్యర్థులు రూ.500; ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

పరీక్ష విధానం ఎలా ఉంటుంది..?

మొత్తం 5 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కెమికల్ సైన్సెస్, ఎర్త్/ అట్మాస్ఫియరిక్/ ఓషియన్/ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు నుంచి మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు. పరీక్షలో సబ్జెక్టుల వారీగా నెగెటివ్ మార్కులు ఉంటాయి.

పరీక్ష పేపర్‌లో మూడు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) విభాగాలుంటాయి.
'పార్ట్-ఎ' విభాగంలో జనరల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలసిస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్, ఇతర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
'పార్ట్-బి', 'పార్ట్-సి' విభాగాల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.07.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.08.2022.
పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.

Information Bulletin

WEBSITE

Published at : 27 Jul 2022 08:05 PM (IST) Tags: CSIR UGC-NET June 2022 NTA Joint CSIR-UGC NET 2022

ఇవి కూడా చూడండి

Agri Courses: ఎన్టీరంగా యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో ఎన్నారై కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్, ప్రవేశం ఇలా

Agri Courses: ఎన్టీరంగా యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో ఎన్నారై కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్, ప్రవేశం ఇలా

GNM Course: సెప్టెంబరు 30తో ముగియనున్న జీఎన్‌ఎం కోర్సు దరఖాస్తు గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

GNM Course: సెప్టెంబరు 30తో ముగియనున్న జీఎన్‌ఎం కోర్సు దరఖాస్తు గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

GATE - 2024 దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

GATE - 2024 దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

TET: ప్రభుత్వ టీచర్లకూ 'టెట్‌' నిబంధన! మూడేళ్లలో అర్హత పొందాల్సిందే?

TET: ప్రభుత్వ టీచర్లకూ 'టెట్‌' నిబంధన! మూడేళ్లలో అర్హత పొందాల్సిందే?

SSC Exams: పదోతరగతి పరీక్షల్లో 'కాంపోజిట్‌' పేపర్ కొనసాగింపు, రద్దుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

SSC Exams: పదోతరగతి పరీక్షల్లో 'కాంపోజిట్‌' పేపర్ కొనసాగింపు, రద్దుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

టాప్ స్టోరీస్

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?