(Source: ECI/ABP News/ABP Majha)
AP SSC: పదోతరగతి విద్యార్థులకు అలర్ట్, ప్రశ్నపత్రాల్లో స్వల్ప మార్పులు - బ్లూప్రింట్ అందుబాటులో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదోతరగతి ప్రశ్నపత్రాల్లో మరోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. గతేడాది ప్రకటించిన బ్లూప్రింట్‌లో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదోతరగతి ప్రశ్నపత్రాల్లో మరోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. గతేడాది ప్రకటించిన బ్లూప్రింట్‌లో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఇందులో భాగంగా ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ప్రశ్నపత్రాల్లో మార్పులు తీసుకొచ్చింది. తెలుగు, హిందీ, ఒడియా, ఉర్దూ, కన్నడ, తమిళ ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసింది. అలాగే సెకండ్ లాంగ్వేజ్ హిందీ, తెలుగు ప్రశ్నపత్రాల్లోనూ మార్పులు చేసింది.
ప్రశ్నపత్రాల్లో మార్పులకు సంబంధించి బ్లూప్రింట్లను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వెయిటేజీతో పాటు మోడల్ పేపర్లనూ వెబ్‌సైట్‌లో పెట్టినట్లు వెల్లడించింది. సైన్స్ ప్రశ్నపత్రం నమూనా కూడా త్వరలోనే వెబ్‌సైట్‌లో పెడతామని పేర్కొంది. ఆంగ్లం, గణితం, సోషల్ స్టడీస్ పేపర్లలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.
క్ర.సం | సబ్జెక్టులు | పేపర్ కోడ్ | డౌన్‌లోడ్ లింక్ |
---|---|---|---|
1 | ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) | 01T & 02T | CLICK HERE |
2 | ఫస్ట్ లాంగ్వేజ్ (హిందీ) | 01H & 02H | CLICK HERE |
3 | ఫస్ట్ లాంగ్వేజ్ (తమిళం) | 01A & 02A | CLICK HERE |
4 | ఫస్ట్ లాంగ్వేజ్ (కన్నడ) | 01K & 02K | CLICK HERE |
5 | ఫస్ట్ లాంగ్వేజ్ (ఒడియా) | 01 'O' & 02'O' | CLICK HERE |
6 | ఫస్ట్ లాంగ్వేజ్ (ఉర్దూ) | 01U & 02U | CLICK HERE |
7 | సెకండ్ లాంగ్వేజ్ (తెలుగు) | 09T | CLICK HERE |
8 | సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) | 09H | CLICK HERE |
9 | ధర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్) | 13E & 14E | CLICK HERE |
10 | మ్యాథమెటిక్స్ (ఇంగ్లిష్ మీడియం) | 15E & 16E | CLICK HERE |
11 | మ్యాథమెటిక్స్ (తెలుగు మీడియం) | 15T & 16E | CLICK HERE |
12 | సోషల్ (ఇంగ్లిష్ మీడియం) | 21E & 22E | CLICK HERE |
13 | సోషల్ (తెలుగు మీడియం) | 21T & 22T | CLICK HERE |
ALSO READ:
ఇంటర్ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, ఆలస్య రుసుముతో ఎప్పటివరకంటే?
తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి పొడిగించింది. ఈమేరకు బుధవారం (జులై 27) ఉత్తర్వులు జారీచేసింది. జులై 31 వరకు ప్రవేశాలు పొందడానికి అవకాశం కల్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత రూ.500 ఆలస్యరుసుము వసూలుచేస్తూ ఆగస్టు 1 నుంచి 16 వరకు ప్రవేశాలు కల్పించవచ్చని బోర్డు తెలిపింది. ఇంటర్ బోర్డు తీసుకున్న ఆలస్యరుసుము నిర్ణయంపై పలు అధ్యాపక సంఘాల నేతలు మండిపడుతున్నారు. విద్యార్థుల నుంచి రూ.500 వసూలు చేయడమనేది చాలా దారుణమని ఆరోపిస్తున్నారు. ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీల లిస్టును వెబ్‌సైట్‌లో పొందుపర్చనినట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఏ కాలేజీకి గుర్తింపు ఉందో లేదో చూసుకొని తమ పిల్లలను ఇంటర్ బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..