![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
CBSE Date Sheet 2022: 10, 12వ తరగతుల టర్మ్ 1 ఎగ్జామ్ డేట్ షీట్స్ వచ్చేశాయా.. టైమ్ టేబుల్‌పై సీబీఎస్ఈ కీలక ప్రకటన
CBSE Date Sheet 2021: సెంట్రల్ బోర్డ్ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతుల టర్మ్ 1 పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ పై సీబీఎస్ఈ కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించింది.
![CBSE Date Sheet 2022: 10, 12వ తరగతుల టర్మ్ 1 ఎగ్జామ్ డేట్ షీట్స్ వచ్చేశాయా.. టైమ్ టేబుల్‌పై సీబీఎస్ఈ కీలక ప్రకటన CBSE Date Sheet 2022 Fake News Central Board of Secondary Education Notification CBSE Date Sheet 2022: 10, 12వ తరగతుల టర్మ్ 1 ఎగ్జామ్ డేట్ షీట్స్ వచ్చేశాయా.. టైమ్ టేబుల్‌పై సీబీఎస్ఈ కీలక ప్రకటన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/d63470dbf11260597d3eef3070c3c871_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CBSE Term-1 Date Sheet: సెంట్రల్ బోర్డ్ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల టర్మ్ 1 పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ (డేట్ షీట్లు) విడుదల చేశారని కొన్ని డేట్ షీట్లు వైరల్ అవుతున్నాయి. దీనిపై సీబీఎస్ఈ స్పందించింది. తాము ఇప్పటివరకూ 10, 12వ తరగతుల టర్మ్ 1 పరీక్షలకు సంబంధించి ఎలాంటి డేట్ షీట్స్ విడుదల చేయలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఫేక్ టైమ్ టేబుల్ లేదా డేట్ షీట్స్ అని పేర్కొంది.
టెన్త్, ఇంటర్ సెకండియర్ విద్యార్థులను తప్పుదోవ పట్టించేందుకు సోషల్ మీడియాలో ఫేక్ డేట్ షీట్లు పోస్ట్ అవుతున్నాయని గుర్తించినట్లు బోర్డు తెలిపింది. నవంబర్ 2021లో నిర్వహించనున్న టర్మ్ 1 ఎగ్జామ్స్‌కు సంబంధించి డేట్ షీట్స్ విడుదల చేయలేదని సీబీఎస్ఈ సోమవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18న ఎగ్జామ్ టైమ్ టేబుల్ విడుదల కావాల్సి ఉంది.
Also Read: నీట్ యూజీ ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల.. అభ్యంతరాలను నమోదు చేయండిలా..
It has come to the notice of CBSE that a fake date sheet is being circulated on social media for the forthcoming term 1 exams in Nov 2021, to confuse students of class X & XII. It is clarified that the board has not released any official notification in this regard till now: CBSE pic.twitter.com/ww2ZoArMKD
— ANI (@ANI) October 18, 2021
నవంబర్ లో టర్మ్ 1 పరీక్షలు..!
ఈ అకడమిక్ ఇయర్‌లో నవంబర్ - డిసెంబర్ మధ్యలో టర్మ్ 1 పరీక్షలు ఉంటాయని సీబీఎస్ఈ ఇటీవల వెల్లడించింది. పరీక్షలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయని తెలిపింది. ఆఫ్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఒక్కో పరీక్షకు 90 నిమిషాల సమయం కేటాయించారు. గతంలో తరహాలోనే పరీక్షలు ఉదయం 10.30 నుంచి కాకుండా 11.30కి ప్రారంభం అవుతాయని వివరించింది. సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.nic.in లో డేట్ షీట్ల వివరాలను వెల్లడించనుంది.
Also Read: దివ్యాంగ విద్యార్థులకు ఏఐసీటీఈ స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.50 వేలు సాయం..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)