X

NEET UG 2021: నీట్ యూజీ ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల.. అభ్యంతరాలను నమోదు చేయండిలా..

NEET UG 2021 Key: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) యూజీ 2021 ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్​ కీని ఎన్టీఏ విడుదల చేసింది. దీంతో పాటు అభ్యర్థుల ఆన్సర్​ షీట్లను కూడా రిలీజ్ చేసింది.

FOLLOW US: 

దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) 2021 యూజీ (అండర్ గ్రాడ్యుయేట్) ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్​ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. సమాధానాల​ కీతో పాటు అభ్యర్థుల ఆన్సర్​ షీట్లను కూడా రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఓఎంఆర్ ఆన్సర్ కీ స్కాన్ కాపీలను వారి ఈమెయిల్ ఐడీలకు పంపినట్లు ఎన్టీఏ వెల్లడించింది. ప్రిలిమనరీ కీపై అభ్యంతరాలను రేపు (అక్టోబ‌ర్ 17 ) రాత్రి 9 గంటల వరకు స్వీకరిస్తామని చెప్పింది. కీలోని ఆన్సర్లను సవాల్ చేయాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. దీనికి సంబంధించిన ఫీజు చెల్లింపు విండ్ రేపటి వరకు తెరిచి ఉంటుందని వివరించింది. ఆన్సర్​ కీ డౌన్‌లోడ్, ఫీజు చెల్లింపు వివరాలను నీట్, ఎన్టీఏ అధికారిక వెబ్​సైట్లు www.neet.nta.nic.in లేదా www.nta.ac.in ​నుంచి చేసుకోవచ్చు. 

Also Read:  డిప్లొమా, ఇంజనీరింగ్ విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌.. ఏడాదికి రూ.50,000 సాయం.. ప్రగతి ప్రోగ్రామ్ వివరాలివే..

నీట్ యూజీ ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను నమోదు చేయండిలా..
* నీట్ అధికారిక వెబ్​సైట్ https://neet.nta.nic.in/ ను ఓపెన్ చేయండి. 
* ఇక్కడ 'వ్యూ కీ అండ్ ఛాలెంజ్ ఆన్సర్ కీ' అనే లింక్ మీద క్లిక్ చేయండి. 
* అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్ వర్డ్ వంటి క్రెడెన్షియల్ వివరాలు ఇవ్వాలి. 
* 'ఛాలెంజ్ /వ్యూ ఆన్సర్ కీ' అనే ఆప్షన్ ఎంచుకోండి. 
* దీంతో నీట్ యూజీ 2021 ఆన్సర్ కీ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది.

* కోడ్ ఆధారంగా ప్రశ్నపత్రాన్ని ఎంచుకుని మీ సమాధానాలను సరిపోల్చుకోండి. 
* కీపై అభ్యంతరాలు ఉంటే మీరు ఛాలెంజ్ చేయాలనుకునే ప్రశ్న పక్కన బాక్స్ ఎంచుకోండి. 
* మీరు అభ్యంతరం లేవనెత్తిన ప్రశ్న సరైన సమాధానానికి సంబంధించిన డాక్యుమెంట్లను అప్​లోడ్​ చేయండి. 
* మీ రిక్వెస్టును సేవ్ చేసుకోండి. తర్వాత ఫీజు చెల్లించండి. 
* ఫాం సబ్మిట్ చేశాక.. భవిష్యత్ అవసరాల కోసం ఒక పీడీఎఫ్ కాపీని భద్రపరుచుకోండి.

Also Read:  నేటి నుంచే జోసా కౌన్సెలింగ్.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి.. పూర్తి వివరాలు ఇవే..

Also Read:  దివ్యాంగ విద్యార్థులకు ఏఐసీటీఈ స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.50 వేలు సాయం.. 

Also Read: కోవిడ్ బాధిత విద్యార్థులకు ఎస్‌బీఐ స్కాల‌ర్‌షిప్‌.. ఏడాదికి రూ.38,500 సాయం.. ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: NEET NEET UG 2021 NEET UG NEET UG Answer Key NEET UG Answer Key Released NEET UG Answer Key Details

సంబంధిత కథనాలు

JEE Main-2022: త్వరలో జేఈఈ మెయిన్-2022 రిజిస్ట్రేషన్.. పరీక్ష ఎప్పుడంటే?

JEE Main-2022: త్వరలో జేఈఈ మెయిన్-2022 రిజిస్ట్రేషన్.. పరీక్ష ఎప్పుడంటే?

Interview: ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? ఆ రోజు ఎలా ఉండాలి? ఏం చేయాలి? 

Interview: ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? ఆ రోజు ఎలా ఉండాలి? ఏం చేయాలి? 

Oxford Dictionary: వర్డ్ ఆఫ్ ది ఇయర్-2021 ఏంటో తెలుసా.. మీకు బాగా తెలిసిన పదమేలే!

Oxford Dictionary: వర్డ్ ఆఫ్ ది ఇయర్-2021 ఏంటో తెలుసా.. మీకు బాగా తెలిసిన పదమేలే!

Exams Postponed: జవాద్ తుపాన్ ఎఫెక్ట్.. ఈ నగరల్లో యూజీసీ-నెట్, ఐఐఎఫ్ టీ పరీక్షలు వాయిదా

Exams Postponed: జవాద్ తుపాన్ ఎఫెక్ట్.. ఈ నగరల్లో యూజీసీ-నెట్, ఐఐఎఫ్ టీ పరీక్షలు వాయిదా

CBSE Question: గుజరాత్ అల్లర్లకు ఎవరు కారణం.. ఆప్షన్స్.. కాంగ్రెస్, బీజేపీ, డెమోక్రటిక్, రిపబ్లికన్.. పరీక్షలో సీబీఎస్ఈ ప్రశ్న

CBSE Question: గుజరాత్ అల్లర్లకు ఎవరు కారణం.. ఆప్షన్స్.. కాంగ్రెస్, బీజేపీ, డెమోక్రటిక్, రిపబ్లికన్.. పరీక్షలో సీబీఎస్ఈ ప్రశ్న

టాప్ స్టోరీస్

Pushpa Trailer: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు.. 

Pushpa Trailer: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు.. 

Telangana Health Department: తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు లేవు

Telangana Health Department: తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు లేవు

December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?

December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?

Clearest Sun Photo: మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు... సూర్యుడి అత్యంత స్పష్టమైన ఇమేజ్ తీసిన ఖగోళ ఫొటో గ్రాఫర్

Clearest Sun Photo: మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు... సూర్యుడి అత్యంత స్పష్టమైన ఇమేజ్ తీసిన ఖగోళ ఫొటో గ్రాఫర్