అన్వేషించండి

CBI FIR On NEET Row: నీట్ పేపర్ లీక్ పై కేసు నమోదు సీబీఐ, కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ

NEET Paper Leak Case | దేశ వ్యాప్తంగా యూజీసీ నీట్, నెట్ పేపర్ లీకులు సంచలనం రేపాయి. ఈ క్రమంలో నీట్ పేపర్ లీకులపై దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది.

CBI registers FIR in paper leak in NEET 2024| న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) నిర్వహణలో అవకతవకలపై సీబీఐ రంగంలోకి దిగింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ 2024 ఎగ్జామ్ ఫలితాలపై కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నీట్ పేపర్ లీక్ ఆరోపణలతో దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సీబీఐ నీట్ పేపర్ లీక్ అంశంపై కేసు నమోదు చేసింది. ఇదివరకే యూజీ నెట్ పేపర్ లీక్ పై సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది. 

నీట్ ఎగ్జామ్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో 1,563 మంది అభ్యర్థులకు నీట్ యూజీ రీఎగ్జామ్ ఆదివారం నిర్వహిస్తున్నారు.  జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపిన వివరా ప్రకారం, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు, ఎన్టీఏ అధికారులు సైతం ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఉంటారు. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మేఘాలయ, హర్యానా,  మరియు చండీగఢ్‌లోని ఆరు కేంద్రాలలో ఎగ్జామ్ ఆలస్యంగా జరగడంతో విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపారు. అయితే దీనిపై వివాదం చెలరేగడంతో గ్రేస్ మార్కులు తొలగించడంతో పాటు రీ ఎగ్జామ్ నిర్వహించారు. 

నీట్ పీజీ ఎగ్జామ్ రద్దు..
దేశంలోకి మెడికల్ కాలేజీలలో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 23న నీట్ పీజీ-2024 ప్రవేశ పరీక్షను నిర్వహించాల్సి ఉంది. అయితే నీట్ యూజీ పేపర్ లీక్, నెట్ పేపర్ లీకుల సమస్య ఉండటంతో ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ 2024 ఎగ్జామ్ ను కేంద్రం వాయిదా వేసింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అవకతవకలు, పేపర్ లీకుల బెడద లేకపోతే ఆదివారం దేశవ్యాప్తంగా 300 నగరాల్లో నీట్ పీజీ- 2024 పరీక్ష జరిగేది.  
Also Read: NTA New Chief: నీట్, నెట్ పేపర్ లీక్ ఎఫెక్ట్ - ఎన్‌టీఏ చీఫ్ పై వేటు, కొత్త డీజీగా విశ్రాంత ఐఏఎస్

యూజీసీ నెట్ ఎగ్జామ్ రద్దు 
జూన్ 18న నిర్వహించిన యూజీసీ నెట్-2024 పరీక్ష ఇదివరకే రద్దు చేశారు. ఎగ్జామ్ నిర్వహించిన మరుసటి రోజే.. జూన్ 19న కేంద్ర ప్రభుత్వం నెట్ ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది  ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో, వివాదం మొదలయ్యేలోపే దీనికి చెక్ పెట్టడానికి.. పారదర్శకత కొనసాగించడానికి ఎగ్జామ్ రద్దుచేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget