అన్వేషించండి

BRAOU Admissions: అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో పీజీ డిప్లొమా ప్రోగ్రాం, స్పెషలైజేషన్లు ఇవే!

తెలుగు రాష్ట్రాల్లోని 10 యూనివర్సిటీ ప్రాంతీయ కేంద్రాల్లో 2022-23 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలుగు రాష్ట్రాల్లోని 10 యూనివర్సిటీ ప్రాంతీయ కేంద్రాల్లో 2022-23 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ లేదా చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి, సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫీజు కూడా ఆన్‌లైన్ ద్వారానే చెల్లించవచ్చు. కోర్సుల కాలవ్యవధి ఏడాది ఉంటుంది. ఇంగ్లిష్ మీడియంలోనే కోర్సులు ఉంటాయి. పూర్తి వివరాలు ఇలా..

వివరాలు..

1. పీజీ డిప్లొమా (ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్)

2. పీజీ డిప్లొమా (మార్కెటింగ్ మేనేజ్‌మెంట్)

3. పీజీ డిప్లొమా (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్)

4. పీజీ డిప్లొమా (ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్)

మీడియం: ఇంగ్లిష్.

వ్యవధి: ఒక సంవత్సరం.

అర్హత: ఏదైనా డిగ్రీ (లేదా) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి చార్టర్డ్ అకౌంటెన్సీ (లేదా) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి కాస్ట్ అకౌంటెన్సీ (లేదా) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా నుంచి కంపెనీ సెక్రటరీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

కోర్సు ఫీజు: రూ.8000.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 13.02.2023.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.03.2023.

Notification

Prospectus

Online Application

Website

Also Read:

మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (MAT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..  

CMAT: కామ‌న్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్ - 2023 నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
దేశ‌వ్యాప్తంగా వివిధ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల‌కు నిర్వహించే కామ‌న్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్ (సీమ్యాట్)-2023 ప్రక‌ట‌న‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుద‌ల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఫిబ్రవరి 13న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మార్చి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

JNTU: బీటెక్ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌, ఎంటెక్‌ లేకుండానే 'పీహెచ్‌డీ'లోకి!
పీజీ లేకున్నా పీహెచ్‌డీ‌ల్లో ప్రవేశాలకు ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. బీటెక్‌ విద్యార్థులు కూడా రిసెర్చ్‌ వైపు వెళ్లేలా జేఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బీటెక్‌ నుంచే పీహెచ్‌డీలోకి ప్రవేశాలు పొందేలా అవకాశం కల్పించింది. అదికూడా ఆనర్స్‌ బీటెక్‌ డిగ్రీ పూర్తిచేసిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించాలని వర్సిటీ నిర్ణయించింది. 
పూర్తివివరాలకు క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Embed widget