AP Inter Board: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూలు విడుదల, చివరితేది ఎప్పుడంటే?
AP Inter Exams Fee: ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు వెల్లడించింది. జూనియర్ కాలేజీలు నవంబర్ 1 నుంచి విద్యార్థుల ఫీజులు స్వీకరించాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
AP Inter Exam Fee Schedule:
ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు వెల్లడించింది. జూనియర్ కాలేజీలు నవంబర్ 1 నుంచి 30 వరకు విద్యార్థుల నుంచి ఫీజులు స్వీకరించాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 30 వరకు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా ఫీజు చెల్లించే అవకాశం ఉందని బోర్డు తెలిపింది. కళాశాలల ప్రిన్సిపల్స్ డిసెంబరు 1లోగా ఫీజును ఇంటర్ బోర్డుఖాతాకు పంపాలని తెలిపింది. ఇక రూ.1000 ఆలస్యరుసుముతో డిసెంబరు 1 నుంచి 15 వరకు పరీక్ష చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. ఇక మొదటి ఏడాది లేదా రెండో ఏడాది ప్రాక్టికల్స్ పరీక్షలు రాసేవారు రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష ఫీజు వివరాలు..
➥ ఇంటర్ ఫస్టియర్ జనరల్/ఒకేషనల్ విద్యార్థులకు: రూ.550
➥ ఇంటర్ సెకండియర్ జనరల్/ఒకేషనల్ విద్యార్థులకు: రూ.550
➥ ఇంటర్ జనరల్/ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఫీజు: రూ.250
➥ ఇంటర్ జనరల్/ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు విద్యార్థులకు (మ్యాథమెటిక్స్ చదివే బైపీసీ విద్యార్థులకు): రూ.150.
ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రెండూ రాసేవారికి..
➥ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ థియరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.1100.
➥ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఫీజు: రూ.500.
➥ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ జనరల్/ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు విద్యార్థులకు (మ్యాథమెటిక్స్ చదివే బైపీసీ విద్యార్థులకు) పరీక్ష ఫీజు: రూ.300.
➥ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరయ్యేవారికి పరీక్ష ఫీజు: ఆర్ట్స్ గ్రూప్-రూ.1240, సైన్స్ గ్రూప్-రూ.1,440.
'హాజరు' మినహాయింపు ఫీజుకు నవంబరు 30 వరకు అవకాశం
వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే ప్రైవేటు విద్యార్థులకు హాజరు మినహాయింపునిస్తూ ఇంటర్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం నవంబరు 30 లోపు రూ.1,500 ఫీజు చెల్లించాలని సూచించింది. అపరాధ రుసుము రూ.500తో డిసెంబరు 31వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.
విద్యార్థులకు 'స్టడీ అవర్స్'..
ఏపీలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్ నిర్వహించాలని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి సౌరబ్ గౌర్ అక్టోబరు 2న ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు విద్యార్థులను చదివించాలని, ఆ సమయంలో విద్యార్థుల హాజరు నమోదు చేసి జిల్లా వృత్తివిద్యాధికారులకు పంపించాలని సూచించారు. సోమవారం నుంచి శనివారం వరకు ఏ రోజు ఏ సబ్జెక్టు చదివించాలనే వివరాలు సైతం తెలిపారు.
తెలంగాణ ఇంటర్ 2024 పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు ఇవే
తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు అక్టోబరు 26న ప్రకటించింది. జూనియర్ కాలేజీలు నవంబర్ 14 వరకు విద్యార్థుల నుంచి ఫీజులు స్వీకరించాలని ఆయా ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 20 వరకు ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించే అవకాశం ఉందని తెలిపింది. ఇంటర్ మొదటి సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.510, వొకేషనల్ రెగ్యులర్ విద్యార్థులు రూ.730, సెకండియర్ ఆర్ట్స్ విద్యార్థులు రూ. 510, సైన్స్, వొకేషనల్ విద్యార్థులు రూ. 730 చొప్పున ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు వివరించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..