AP TET 2024: ఏపీ టెట్-2024 పేపర్-1 ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లు అందుబాటులో, డైరెక్ట్ లింక్స్ ఇవే
ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 పరీక్షకు సంబంధించిన మార్చి 1 వరకు జరిగిన టెట్ పేపర్-1 పరీక్షల ఆన్సర్ కీ, అభ్యర్థుల సమాధానపత్రాలను (TET Response Sheets) పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
AP TET 2024 Answer Key: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 పరీక్షకు సంబంధించిన మార్చి 1 వరకు జరిగిన టెట్ పేపర్-1 పరీక్షల ఆన్సర్ కీ, అభ్యర్థుల సమాధానపత్రాలను (TET Response Sheets) పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో సబ్జె్క్టులవారీగా ఆన్సర్ కీ, రెస్సాన్స్ షీట్లను అందుబాటులో ఉంచింది. ఇక టెట్ పేపర్-2 పరీక్షలు మార్చి 2న ప్రారంభమయ్యాయి. మార్చి 6 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఆన్సర్ కీపై అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించారు. అభ్యంతరాలున్నవారు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆన్‌లైన్ లింక్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది.
ఏపీ టెట్-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 7న విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు రాసేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 23 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు పేపర్-1 పరీక్షలు నిర్వహించారు. మార్చి 6 వరకు ఏపీ టెట్ 2024 పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం టెట్ ప్రాథమిక కీ మార్చి 10న విడుదల చేస్తారు. ఈ కీపై అభ్యంతరాలను మార్చి 11 వరకు స్వీకరిస్తారు. అనంతరం ఏపీ టెట్ 2024 తుది కీని మార్చి 13న రిలీజ్ చేస్తారు. మార్చి 14న టెట్ తుది ఫలితాలు విడుదల చేస్తారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
AP-TET FEB-2024 Question Papers & Keys
టెట్, డీఎస్సీ ఎగ్జామ్స్‌పై హైకోర్టు కీలక తీర్పు..
ఏపీలో టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. మార్చ్ 15 వ తేది నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ ను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చ్ 14 వ తేదీన వస్తున్నాయని, మార్చ్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై హైకోర్ట్ లో పలువురు విద్యార్థులు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై జవ్వాజి శరత్ చంద్ర వాదనలు వినిపించారు. కేవలం ఒక్క రోజు సమయంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారని శరత్ చంద్ర ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎప్పుడు అటువంటి షెడ్యూల్ ఇవ్వలేదని వాదనలు వినిపించారు. నిరుద్యోగుల హక్కులను హరిస్తున్నారని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. పిటిషన్ల తరపున న్యాయవాదుల వాదనలను హైకోర్ట్ పరిగణలోకి తీసుకుంది. మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ ను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలకు నాలుగు వారాలు కనీసం సమయం ఉండాలని ఆదేశాలు ఇచ్చింది.
ALSO READ:
తెలంగాణ డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న 'మెగా డీఎస్సీ-2024' నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 2లోపు నిర్ణీత ఫీజు చెల్లించి, మార్చి 3న రాత్రి 11.50లోపు దరఖాస్తులు సమర్పించాాలి. దరఖాస్తు ఫీజు కింద అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసిన వాళ్లు ఆయా పోస్టులకు మళ్లీ కొత్తగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదు. పరీక్షల తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. గరిష్ఠ వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచడం, అదనంగా పోస్టులను చేర్చడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
డీఎస్సీ, దరఖాస్తు ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..