అన్వేషించండి

AP POLYCET 2024: ఏపీ పాలిసెట్ 2024 కౌన్సెలింగ్ ప్రారంభం, వెబ్ ఆప్షన్ల నమోదు ఎప్పటినుంచంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ మే 24న ప్రారంభమైంది. అభ్యర్థులు మే 24 నుంచి జూన్ 2 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

AP POLYCET 2024 Counselling: ఆంధ్రప్రదేశ్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ మే 24న ప్రారంభమైంది. పాలిసెట్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మే 24 నుంచి జూన్ 2 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మే 27 నుంచి జూన్‌ 3 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టనున్నారు. స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు మే 31 నుంచి జూన్‌ 3 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.700; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినవారు మే 31 నుంచి జూన్ 5 వరకు  కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌ఆప్షన్లను మార్చుకునేందుకు జూన్ 5న అవకాశం కల్పించారు. అభ్యర్థులకు జూన్ 7న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జూన్ 10 నుంచి 14 వరకు సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ లేదా ఆన్‌లైన్‌ విధానం ద్వారా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. జూన్‌ 10 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. 

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు..

➥ పాలిసెట్ కౌన్సెలింగ్  ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 24.05.2024 - 02.06.2024 వరకు

➥ సర్టిఫికేట్ వెరిఫికేషన్:  27.05.2024 - 03.06.2024.

➥ స్పెషల్ కేటిగిరీ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్: 31.05.2024 - 03.06.2024.

➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు:  31.05.2024 - 05.06.2024.

➥ వెబ్‌ఆప్షన్లను మార్చుకునేందుకు గడువు: 05.06.2024. 

➥ పాలిసెట్ సీట్ల కేటాయింపు:  07.06.2024.

Counselling Notification

Fee Payment

Website


AP POLYCET 2024: ఏపీ పాలిసెట్ 2024 కౌన్సెలింగ్ ప్రారంభం, వెబ్ ఆప్షన్ల నమోదు ఎప్పటినుంచంటే?

ఏపీలో ఏప్రిల్ 27న ఎస్బీటీఈటీ పాలిసెట్-2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష ప్రాథమిక కీని ఏప్రిల్ 30న విడుదల చేశారు. ఆన్సర్ కీపై విద్యార్థుల నుంచి మే 4 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. తుది ఆన్సర్ కీని మే 5న SBTRT విడుదల చేసింది. మే 8న పాలిసెట్ ఫలితాలను విడుదల చేసింది.  ఈ ఏడాది పాలిసెట్‌లో మొత్తం 1,24,430 మంది అర్హత సాధించారు. పాలిసెట్ ఫలితాల్లో మొత్తం 87.61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం మొత్తం 1.42 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1.24 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారిలో బాలికలు 50,710 (89.81%) మంది ఉండగా.. బాలురు 73,720 (86.16%) మంది ఉన్నారు. పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని 267 ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీల్లోని 29 కోర్సుల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రవేశాలు కల్పించే సంస్థలు..
పాలిసెట్‌ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

అందుబాటులో ఉన్న డిప్లొమా కోర్సులు..
సివిల్ ఇంజినీరింగ్(CE), ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్(ARC), మెకానికల్ ఇంజినీరింగ్(MEC/MRA), ఆటోమొబైల్ ఇంజినీరింగ్(AUT), ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్(EEE), ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీ (EVT) ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్(ECE), ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్(ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్-EII), ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్(IOT), అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్(AEI), కంప్యూటర్‌ ఇంజినీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-మెషిన్ లెర్నింగ్, 3-డి ఏనిమేషన్ అండ్ గ్రాఫిక్స్ (AMG), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI), కంప్యూటర్ సైన్స అండ్ ఇంజినీరింగ్(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-CAI), క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా(CCB), కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్‌వర్కింగ్ (CCN), మైనింగ్ ఇంజినీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ (CCP), అప్పారెల్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ (AFT), మెటలర్జికల్ ఇంజినీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, సిరామిక్ ఇంజినీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

US Election Results 5 Reasons for Kamala Harris Defeatజగనన్నపై కారుకూతలు కూస్తార్రా? ఇక మొదలుపెడుతున్నా!Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
YS Jagan: ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
Pawan Kalyan: సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
Snow In Desert: మంచుకొండలుగా సౌదీ ఎడారులు - ఇలాంటివి కాలజ్ఞానంలోనూ చెప్పలేదుగా !
మంచుకొండలుగా సౌదీ ఎడారులు - ఇలాంటివి కాలజ్ఞానంలోనూ చెప్పలేదుగా !
YS Jagan On DGP: అందర్నీ గుర్తు పెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం - పోలీసు అధికారులకు జగన్ హెచ్చరికలు
అందర్నీ గుర్తు పెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం - పోలీసు అధికారులకు జగన్ హెచ్చరికలు
Embed widget