By: ABP Desam | Updated at : 30 Sep 2023 11:07 PM (IST)
Edited By: omeprakash
ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాయామ కాలేజీల్లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'ఏపీ పీఈసెట్-2023' కౌన్సెలింగ్‌కు సంబంధించి సెప్టెంబరు 30న ఉన్నత విద్యామండలి సీట్లను కేటాయించింది. సీట్ల కేటాయింపు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులు అవసరమైన వివరాలు నమోదుచేసి సీట్ల కేటాయింపు వివరాలు చూసుకోవచ్చు. కౌన్సెలింగ్‌లో సీట్లు సాధించిన విద్యార్థులు అక్టోబరు 3 నుంచి 7వ తేదీల మధ్య సంబంధిత కాలేజీల్లో ప్రవేశాలు పొందవల్సి ఉంటుంది.
అలాట్‌మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం క్లిక్ చేయండి..
కళాశాలలవారీగా సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ పీఈసెట్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 21 నుంచి అన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. అన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 23 వరకు కొనసాగింది. రిజిస్ట్రేషన్ సమయంలో జనరల్, బీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.500 ఫీజు కింద వసూలు చేశారు. సెప్టెంబరు 26 నుంచి సెప్టెంబరు 28 వరకు కాలేజీల ఎంపిక ఆప్షన్లకు అవకాశం కల్పించారు. సెప్టెంబరు 29న దరఖాస్తులో మార్పులు చేసుకునే అవకాశం ఇచ్చారు.
రాష్ట్రంలోని బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ పీఈసెట్-2023 నోటిఫికేషన్ మార్చి 18న విడుదలైన సంగతి తెలిసిందే. బీపీఈడీ కోర్సుకు డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు, డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇక యూజీడీపీఈడీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు మే 31న పరీక్ష నిర్వహించారు. వీటికి సంబంధించిన ఫలితాలను జూన్ 16న విడుదల చేశారు. పరీక్షలో మొత్తం 977 మంది ఉత్తీర్ణత సాధించారు.
ALSO READ:
టీఎస్ ఐసెట్-2023 రిపోర్టింగ్ గడువు పెంపు, ఎప్పటివరకంటే?
తెలంగాణ ఐసెట్ చివరి విడత కౌన్సెలింగ్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్లు పొందిన వారు ఫీజు చెల్లించేందుకు, కళాశాలల్లో రిపోర్ట్ చేసేందుకు గడువును అక్టోబరు 6 వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం కళాశాలలో రిపోర్టింగ్ చేసే గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది. అయితే అక్టోబరు 6 వరకు అవకాశం కల్పించారు. సీట్లు పొందినవారు సెప్టెంబరు 6 లోగా నేరుగా కళాశాలకు వెళ్లి మరోమారు ధ్రువపత్రాల పరిశీలన చేయించుకొని, సీటు కేటాయింపును నిర్దారించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 26, 27 తేదీల్లో నిర్వహించిన 'టీఎస్ ఐసెట్-2023' పరీక్ష ఫలితాలు జూన్ 29న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రవేశపరీక్షలో మొత్తం 61,092 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సెప్టెంబరు 6న ఐసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబరు 15న సీట్లను కేటాయించారు. ఎంబీఏలో 87.33 శాతం కన్వీనర్ కోటా సీట్లు భర్తీకాగా, ఎంసీఏలో అన్ని సీట్లు నిండాయి. ఐసెట్‌లో 61,092 మంది ఉత్తీర్ణులుకాగా.. ధ్రువపత్రాల పరిశీలనకు కేవలం 31,552 మందే హాజరయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
CBSE: సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కులపై బోర్డు కీలక నిర్ణయం, ఇకపై అవి ఉండవు
LAWCET: లాసెట్ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు
CSIR UGC NET 2023: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?
JEE Main 2024: జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Andhra Telangana Dispute : కేంద్రం అధీనంలోకి సాగర్, శ్రీశైలం డ్యాములు - ఏపీ ప్రభుత్వ దూకుడుతో సాధించిందేంటి ?
KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ భరోసా
Salaar - Ugramm: 'సలార్' ట్రైలర్ విడుదల తర్వాత కొత్త డౌట్స్ - ప్రశాంత్ నీల్ మోసం చేస్తున్నారా?
Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!
/body>