AP Inter Supply Results 2022: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్
AP Inter Supply Results: ఏపీలో ఇటీవల నిర్వహించిన ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్ సైట్ https://resultsbie.ap.gov.in/లో ఫలితాలు చెక్ చేసుకోవాలి.
![AP Inter Supply Results 2022: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ AP Inter Supplementary Results 2022 Declared Today Check Results Using Direct Link resultsbie.ap.gov.in www.manabadi.co.in AP Inter Supply Results 2022: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/30/2ff64b1e7d276303251c71e4ec5a8d841661843581472233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP Inter Supply Results 2022: ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఇంటర్ బోర్డ్ కార్యదర్శి శేషగిరిబాబు ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ మంగళవారం విడుదల చేశారు. ఏపీలో ఈ ఏడాది ఆగస్టు 3 నుంచి ఆగస్టు 12 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్స్‌లో పరీక్షలు జరిగాయి. దాదాపు 3 లక్షలకు పైగా విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ https://resultsbie.ap.gov.in/
ఈ ఏడాది మే 6 నుంచి 25 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం నుంచి మొత్తం 2,41,591 (54 శాతం) మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్‌లో శాతం 2,58,449 (61 శాతం) మంది పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో బాలుర ఉత్తీర్ణత శాతం 49%గా ఉండగా, బాలికలు 65 శాతం పాస్ అయ్యారు. ఇక సెకండ్ ఇయర్‌లో బాలురు 54 శాతం, బాలికలు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల పరంగా చూసుకుంటే అత్యధికంగా కృష్ణా జిల్లా 72 శాతం, స్వల్పంగా కడప 55 శాతం విద్యార్థులు పాసయ్యారు.
విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను https://bie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
HORTICET - 2022: ఏపీ హార్టీసెట్ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ - పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2022-23 విద్యా సంవత్సరానికి గాను బీఎస్సీ(ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి 'ఏపీ హార్టీసెట్-2022' నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హార్టీసెట్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 92 సీట్లను భర్తీ చేస్తారు. వీటిలో యూనివర్సిటీ కాలేజీ సీట్లు 52 కాగా.. ప్రైవేట్ కాలేజీ సీట్లు 40 ఉన్నాయి. మొత్తం సీట్లులో లోకల్ అభ్యర్థులకు 85 శాతం సీట్లు, 15 శాతం సీట్లు అన్-రిజర్వ్‌డ్ కింద భర్తీ చేస్తారు.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
NTR Health University: పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!
ఏపీలోని పారా మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టు 12న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఆయా కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ (పారామెడికల్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 13న మధ్యాహ్నం 11 గంటల నుంచి సెప్టెంబరు 2న సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)