Inter Recounting: ఏప్రిల్ 18 నుంచి ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు అవకాశం
AP inter revaluation: ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో సందేహాలున్న విద్యార్థులకు జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అవకాశం కల్పించారు.ఏప్రిల్ 18 నుంచి 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
AP Inter Recounting (RC) and Reverification (RV): ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో సందేహాలున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఏప్రిల్ 18 నుంచి 24 వరకు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం కూడా విద్యార్థులు ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాలని ఆయన కోరారు. రీకౌంటింగ్ ద్వారా మరోసారి మార్కుల మూల్యాంకనం, రీవెరిఫికేషన్ ద్వారా జవాబుపత్రాల స్కానింగ్ కాపీలు, జవాబుపత్రాల వెరిఫికేషన్ కోరవచ్చు.
ఆందోళన చెందవద్దు..
ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన ఫెయిల్ అయిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఇంటర్ బోర్డు కార్యదర్శి సూచించారు. ముఖ్యంగా సెకండియర్ విద్యార్థులు టెన్షన్ పడొద్దని, తల్లిదండ్రులు కూడా వారి పరిస్థితి అర్థం చేసుకోవాలని, పిల్లలపై కోపడవద్దని కోరారు. విద్యార్థులు రెగ్యులర్ లో పాస్ అయ్యారా.?, సప్లిమెంటరీలో పాస్ అయ్యారా.? వంటివి మార్కుల జాబితాలో ఏమీ వివరాలు ఉండవని.. విద్యార్థులు కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు క్షణికావేశానికి లోను కావద్దని అన్నారు.
మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు...
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 1 వరకూ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్‌లో ఫెయిల్ అయినా విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు, విద్యార్థులు ఏదైనా సబ్జెక్టులో మార్కులు తక్కువగా వస్తే ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసుకోవచ్చు.
ప్రాక్టికల్ పరీక్షలు ఎప్పుడంటే?
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతోపాటు, ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు మరోసారి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూలును ప్రకటించారు. మే 1 నుంచి 4 వరకు సంబంధిత జిల్లా కేంద్రాల్లో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలకు (AP Inter Results) సంబంధించి ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం, సెకండియర్‌లో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో జనరల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 4,61,273 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 3,10,875 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 67 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 3,93,757 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 3,06,528 మంది పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ఒకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 38,483 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 23,181 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 32,339 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 23,000 మంది పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.