అన్వేషించండి

AP Inter Results 2024: ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - ఫలితాలు త్వరలోనే వచ్చేస్తున్నాయ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియ్ బోర్డు సమాయత్తమవుతోంది. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు ఒకేసారి వెలువడనున్నాయి.

AP Inter Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియ్ బోర్డు సమాయత్తమవుతోంది. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు ఒకేసారి వెలువడనున్నాయి. ఇంటర్ ఫలితాలను ఏప్రిల్‌ రెండోవారం లేదా మూడో వారంలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్‌ జవాబుపత్రాల మూల్యాంకనం ముగియగా.. మరోసారి జవాబుపత్రాల పరిశీలన, మార్కుల నమోదు ప్రక్రియ పూర్తికాగానే ఫలితాలు విడుదల చేయనున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ ప‌బ్లిక్‌ పరీక్షలు జ‌రిగిన విష‌యం తెల్సిందే. ఈ ఏడాది ఇంట‌ర్ విద్యార్థులు మొత్తం 10,52,221 మంది ఉన్నారు. ఇందులో మొదటి  సంవత్సరం 4,73,058 మంది, రెండో  సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. ఒకేషనల్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు దాదాపు లక్ష వరకు ఉన్నారు. ఇంటర్ పరీక్షలు ముగియడంతో.. మూల్యాంకన ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. ఏప్రిల్‌ 4న మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. సుమారుగా 23వేల మంది అధ్యాపకులు  పాల్గొన్నారు. ఒక్కో అధ్యాపకుడూ రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేసిన తర్వాత మార్కులు అప్‌లోడ్ చేయనున్నారు. ఇవన్నీ అయిపోగానే ఫలితాలను వెల్లడించనున్నారు.

గతేడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్‌తోపాటు సెకండియర్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 26న విడుదల చేశారు. అంటే 22 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించారు. ఈసారి కూడా అంతే సమయంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఏప్రిల్ 12 లేదా ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 

ఏపీ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి 
Step 1: ఏపీ ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్   https://bie.ap.gov.in/ సందర్శించండి
Step 2: హోం పేజీలో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2024 లింక్ (Andhra Pradesh Inter Results 2024 link) మీద క్లిక్ చేయండి
Step 3: హాల్ టికెట్ నెంబర్ (రిజిస్ట్రేషన్ నెంబర్), పుట్టిన తేదీ లాంటి వివరాలు నమోదు చేయాలి
Step 4: విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి
Step 5: విద్యార్థులు రిజల్ట్స్‌ స్కోర్ కార్డును పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
Step 6: ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీల ప్రవేశాల సమయంలో మీ ఇంటర్ స్కోర్ కార్డు అవసరాల కోసం రిజల్ట్ ు ప్రింటౌట్ తీసుకోవడం బెటర్.

ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్లు..

https://examresults.ap.nic.in

www.bie.ap.gov.in 

ALSO READ:

AP SSC Results: పదోతరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీలో ఇటీవల పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్థులకు గుడ్‌న్యూస్. పదోతరగతి పరీక్ష ఫలితాల వెల్లడికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 18న ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్‌, మార్చి 20న ఇంగ్లిష్, మార్చి 22న మ్యాథమెటిక్స్, మార్చి 23న ఫిజికల్ సైన్స్, మార్చి 26న బయాలజీ, మార్చి 27న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించగా.. మార్చి 28, 30 తేదీల్లో వొకేషనల్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలకు ముగియగానే అధికారులు జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. ఈ ప్రక్రియ ఏప్రిల్‌ 8తో ముగియనుంది. విద్యార్థుల జవాబుపత్రాలను మరోసారి పరిశీలించి, మార్కుల నమోదు పూర్తిచేయనున్నారు. ఆ వెంటనే ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇదంతా పూర్తవడానికి కనీసం రెండువారాల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఏప్రిల్‌ నాలుగో వారంనాటికి ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ కుదరనిపక్షలో మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget