అన్వేషించండి

AP ICET Hall Ticket: ఏపీ ఐసెట్‌ హాల్‌టికెట్లు విడుదల, వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి - పరీక్ష ఎప్పుడంటే?

AP ICET Admit Card: ఏపీలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2025 పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు.

APICET 2025 Halltickets: ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2025 పరీక్ష హాల్‌టికెట్లను (AP ICET Admit Card) ఆంధ్ర విశ్వవిద్యాలయం మే 3న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఐసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, డిగ్రీ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 7న ఏపీ ఐసెట్-2025 ప్రవేశపరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. మే 10న ప్రిలిమినరీ కీ విడుదల చేసి మే 12 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత మే 21న ఐసెట్ ఫలితాలు వెల్లడించనున్నారు. ఏపీఐసెట్‌లో ర్యాంకు ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఆంధ్ర యూనివిర్సటీ (AU) ఐసెట్ పరీక్షల బాధ్యత నిర్వహిస్తోంది.  

APICET 2025 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష విధానం..
మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: కమ్యూనికేషన్  ఎబిలిటీ-70 ప్రశ్నలు-70 మార్కులు, సెక్షన్-సి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-55 ప్రశ్నలు-55 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు (రెండున్నర గంటలు).

ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2025 నోటిఫికేషన్ మార్చి 11న వెలువడిన సంగతి తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ మార్చి 13న ప్రారంభమైంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 9 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.650 చెల్లించారు. బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చెల్లించారు. ఇక రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 10 నుంచి 14 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి 19 వరకు, రూ.4000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 నుంచి 24 వరకు, అలాగే రూ.10,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఏప్రిల్ 29, 30 తేదీల్లో అవకాశం కల్పించారు. తాజాగా పరీక్ష హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. మే 7న ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 

ఏపీ ఐసెట్-2025 ముఖ్యమైన తేదీలు: 

► ఏపీఐసెట్-2025 నోటిఫికేషన్:  11-03-2025.

► దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 13-03-2025. 

► దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 09-04-2025.

► రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 10-04-2025 - 14-04-2025.

► రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 15-04-2025 -19-04-2025.

► రూ.4000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 20-04-2025 - 24-04-2025.

► రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 25-04-2025 - 28-04-2025.

► దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం: 29-04-2025- 30-04-2025.

► పరీక్ష హాల్‌టికెట్లు: 03-05-2025 నుంచి అందుబాటులో. 

► ఏపీ ఐసెట్ పరీక్ష నిర్వహణ: 07-05-2025. 

పరీక్ష సమయం: 09.00 AM - 11.30AM, 02.00 PM to 04.30 PM

► ప్రిలిమినరీ ఆన్సర్ కీ: 10-05-2025 – 05.00 PM

► ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 12-05-2025 – 05.00 PM

► ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాల వెల్లడి: 21-05-2025.

టాప్ హెడ్ లైన్స్

AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget