News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP SSC Result: ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 64.23 శాతం ఉత్తీర్ణత, ఫలితాల కోసం డైరెక్ట్ లింక్

పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 1,91,896 మంది పరీక్షలు రాయగా 1,31,233 మంది పరీక్ష ఉత్తీర్ణత సాధించారు.

FOLLOW US: 
Share:

ఏపీ 2022 పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఆగస్టు 3న విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం 10 గంటలకు పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.ఈ ఏడాది జులై 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన  సంగతి తెలిసిందే. 

AP S.S.C EXAMINATION , JULY - 2022 RESULTS

64.23 శాతం ఉత్తీర్ణత..
ఈ ఏడాది పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు రెండు లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో బాలురు 1,09,413 మంది, బాలికలు 82,433 మంది ఉన్నారు.  ఫలితాల్లో 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 1,91,896 మంది పరీక్షలు రాయగా 1,31,233 మంది పరీక్ష  ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 60 శాతం పైగా ఉత్తీర్ణులు కాగా.. బాలికలు 68  శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. ఇక అత్యల్పంగా పశ్చిమగోదావరి  జిల్లాలో  46.66  శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు.

Also Read: పేద విద్యార్థుల జీవితాల్లో ‘పరివర్తనం’ - హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌

రెగ్యులర్ విద్యార్థులతో సమానంగానే..
సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని 2022–ఏప్రిల్‌ రెగ్యులర్‌ బ్యాచ్‌ విద్యార్థులతో సమానంగా పరిగణించనున్నారు. నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులకు వారికి వచ్చిన మార్కులను అనుసరించి ఫస్ట్, సెకండ్, థర్డ్‌ డివిజన్‌లలో పాసైనట్లుగా సర్టిఫికెట్లు ఇస్తారు. సప్లిమెంటరీలో పాసైన వారికి మాత్రం ఎన్ని మార్కులు వచ్చినా కంపార్టుమెంటల్‌ పాస్‌గానే పరిగణిస్తుండేవారు. కానీ ఈ సారి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని కూడా రెగ్యులర్‌ విద్యార్థులతో సమానంగా పరిగణించనున్నారు. 

గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఎటువంటి పరీక్షలను నిర్వహించలేదు.. ఈ ఏడాది జరిగిన పరీక్షలు ప్రభుత్వానికి నిరాశను మిగిలింది. అనుకున్న దానికన్నా కూడా తక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం ఇక ముందు అలాంటి తప్పులను జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. 

Read Also: బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ!

మార్కుల రూపంలో..
పదోతరగతి రెగ్యులర్ పరీక్షలకు మొత్తం 6,22,537 మంది హాజరుకాగా 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించారని అధికారులు తెలిపారు. 67.26 శాతం మాత్రమే ఉతీర్ణత నమోదైంది. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జులై 6 నుంచి 15 వరకు  పదో తరగతి సప్లిమెంటరీ నిర్వహించారు. ఈ పరీక్షలకు దాదాపు 2,01,627ల మంది విద్యార్ధులు హాజరయ్యారు. జూన్ 6న ఫలితాలను విడుదల చేశారు. నెలరోజుల్లోపే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఇది ఇలా ఉండగా, ఆంధ్రాలో ఈసారి పదోతరగతి ఫలితాలను గ్రేడ్లకు బదులుగా మార్కుల రూపంలో ప్రకటించిన విషయం తెలిసిందే. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 03 Aug 2022 11:25 AM (IST) Tags: AP 10th class Supplementary 2022 Results AP 10th Supplementary Result AP Tenth class results

ఇవి కూడా చూడండి

TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ

TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ

Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Polytechnic Branches: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్‌బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్

Polytechnic Branches: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్‌బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్

CAT 2023 Exam: క్యాట్‌-2023 పరీక్షకు వేళాయే - హాజరుకానున్న 3.3 లక్షల మంది అభ్యర్థులు, ఇవి పాటించాల్సిందే!

CAT 2023 Exam: క్యాట్‌-2023 పరీక్షకు వేళాయే - హాజరుకానున్న 3.3 లక్షల మంది అభ్యర్థులు, ఇవి పాటించాల్సిందే!

AICTE: విద్యా సంస్థల మిళితం, ఇకపై కాలేజీలు కలిసి పనిచేయొచ్చు - త్వరలో ఏఐసీటీఈ మార్గదర్శకాలు

AICTE: విద్యా సంస్థల మిళితం, ఇకపై కాలేజీలు కలిసి పనిచేయొచ్చు - త్వరలో ఏఐసీటీఈ మార్గదర్శకాలు

టాప్ స్టోరీస్

IND Vs AUS, Innings Highlights:శతకంతో రుతురాజ్ ఊచకోత , ఆసీస్ పై మరోసారి భారీ స్కోర్

IND Vs AUS, Innings Highlights:శతకంతో  రుతురాజ్ ఊచకోత , ఆసీస్ పై మరోసారి భారీ స్కోర్

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Animal: 'యానిమల్'లో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ - ఆ మెషీన్ గన్ కాస్ట్ ఎంతో తెలుసా?

Animal: 'యానిమల్'లో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ - ఆ మెషీన్ గన్ కాస్ట్ ఎంతో తెలుసా?