(Source: ECI/ABP News/ABP Majha)
PM YASASVI Scheme 2022: బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ!
యశస్వి అనేది ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీ/ ఎస్ఎన్‌టీ వర్గాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్కాలర్‌షిప్ పథకం.
Young Achievers Scholarship Award Scheme for Vibrant India: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పాఠశాల విద్యార్థుల చదువుల కోసం ఆర్థికంగా ఆసరా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా (YASASVI) ప్రవేశ పరీక్ష-2022 నిర్వహణకు గాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న పాఠశాల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
యశస్వి అనేది ఇతర వెనుకబడిన తరగతి (ఓబీసీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ), డీ-నోటిఫైడ్, నోమాడిక్ & సెమీ నోమాడిక్ ట్రైబ్స్ (డీఎన్‌టీ/ ఎస్ఎన్‌టీ) వర్గాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్కాలర్‌షిప్ పథకం.
అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో తొమ్మిదో తరగతి లేదా పదకొండో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. వార్షిక ఆదాయం 2.5 లక్షలకు మించని తల్లిదండ్రుల విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా అందిస్తున్న ‘YASASVI 2022’ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నవిద్యార్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (MCQ ఫార్మాట్) ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష సెప్టెంబర్ 11న నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జూలై 27 నుంచి ప్రారంభమైంది. అదే సమయంలో, ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 26. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ yet.nta.ac.inని సందర్శించడం ద్వారా తమ దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, అమరావతి, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం.
పరీక్ష విధానం: ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో బహుళైచ్చిక ప్రశ్నలుంటాయి. వ్యవధి 3 గంటలు. గణితం, సైన్స్, సోషల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్/ నాలెడ్జ్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలుంటాయి. ప్రశ్నల సంఖ్య 100, ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
- దరఖాస్తు చేయడానికి, విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ yet.nta.ac.inని సందర్శించండి.
- దీని తర్వాత వెబ్‌సైట్‌లో ఇచ్చిన రిజిస్టర్ లింక్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు పేరు, ఇమెయిల్, పుట్టిన తేదీ, పాస్‌వర్డ్ మొదలైన వాటిని నమోదు చేసి అకౌంట్‌ను సృష్టించండి.
- ఇప్పుడు అప్లికేషన్ నంబర్ పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వండి.
- ఇప్పుడు దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి, సమర్పించండి.
- వీలైతే, దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత, అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 26.08.2022.
- దరఖాస్తు సవరణలకు అవకాశం: 27.08.2022 నుంచి 31.08.2022 వరకు.
- హాల్‌టికెట్ డౌన్‌లోడ్ తేది: 05.09.2022 నుంచి
- పరీక్ష తేది: 11.09.2022.