APRCET: ఏపీ ఆర్‌సెట్-2024 పరీక్ష తేదీ వెల్లడి, ఆలస్యరుసుముతో దరఖాస్తుకు ఎప్పటివరకు అవకాశమంటే?
ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2023-24 ప్రవేశ పరీక్షలు మే 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దేవరాజులు మార్చి 21న ఒక ప్రకటనలో తెలిపారు.
APRCET Exam Date: ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (APRCET) 2023-24 ప్రవేశ పరీక్షలు మే 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దేవరాజులు మార్చి 21న ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పీహెచ్‌డీ సీట్ల భర్తీకి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువు మార్చి 19తో ముగియగా.. రూ.2000 ఆలస్య రుసుంతో మార్చి 29 వరకు, రూ.5000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 6 వరకు గడువు పొడిగించినట్లు కన్వీనర్ వెల్లడించారు.
ఏప్రిల్ 4 నుంచి 7 వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణలకు వెసులుబాటు కల్పించారు. అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఏపీఆర్‌సెట్ ద్వారా ఏపీలోని 16 యూనివర్సిటీలలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్(ఫుల్ టైమ్/పార్ట్ టైమ్) ప్రవేశాలు కల్పిస్తారు. నోటిఫికేషన్ సమయంలో పరీక్ష తేదీని వెల్లడించని అధికారులు తాజాగా పరీక్ష తేదీని వెల్లడించారు. మొత్తం 62 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సబంధించిన మాక్ టెస్ట్‌ను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
వివరాలు..
* ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్‌సెట్) 2023-24
విభాగాలు: సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ ప్లానింగ్, లా అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ తదితరాలు.
అర్హతలు: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ(సైన్స్, ఆర్ట్స్, మేనేజ్మెంట్, కామర్స్, లా, ఫార్మసీ, ఇంజినీరింగ్ తదితర కోర్సులు) ఉత్తీర్ణులై ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర రిజర్వేషన్కేటగిరీ అభ్యర్థులు 50శాతం మార్కులు సాధించాలి. పీజీ చివరి సంవత్సరం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులూ అర్హులే.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. యూజీసీ నెట్, సీఎస్ఐఆర్; నెట్, గేట్, స్లెట్, జీప్యాట్, ఎంఫిల్ విద్యార్థులు రిసెర్చ్ మెథడాలజీ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం: మొత్తం 140 మార్కులకు కంప్యూటర్ ఆధారిత విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-ఎలో రిసెర్చ్ మెథడాలజీ-70 ప్రశ్నలు-70 మార్కులు, సెక్షన్-బి అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు-70 ప్రశ్నలు-70 మార్కులు ఉంటాయి. పరీక్షలో బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్షలో జనరల్ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధిస్తే ఇంటర్వ్యూకు అర్హులవుతారు.
పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విజయవాడ, కడప, విజయనగరం, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, ఒంగోలు, అనంతపురం, కాకినాడ, నెల్లూరు, భీమవరం, తిరుపతి, హైదరాబాద్.
ముఖ్యమైన తేదీలు..
✦ నోటిఫికేషన్ వెల్లడి: 15.02.2024.
✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.02.2024.
✦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తులకు చివరితేది: 19.03.2024.
✦ రూ.2000 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు చివరితేది: 29.03.2024.
✦ రూ.5000 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు చివరితేది: 06.04.2024.
✦ దరఖాస్తుల సవరణకు అవకాశం: 04.04.2024 - 07.04.2024.
✦ పరీక్ష తేదీ: 02 - 05.05.2024.
పరీక్ష సమయం: 09:00 AM to 11:00 AM & 02:00 PM to 04:00 PM
✦ ప్రిలిమినరీ ఆన్సర్ కీ వెల్లడి: 08.05.2024.
✦ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణకు చివరితేది: 10.05.2024.
✦ ఫలితాల వెల్లడి: 20.05.2024.