By: ABP Desam | Updated at : 24 Dec 2021 07:45 PM (IST)
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులంతా పాస్
ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులందర్నీ పాస్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇటీవల తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను ప్రకటించింది. అయితే 49శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 51 శాతం మంది ఫెయిలయ్యారు. దీంతో విద్యార్థులకు సరైన సమయం ఇవ్వలేదని.. క్లాసులు సరిగ్గా చెప్పలేదని విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు విమర్శలు ప్రారంభించాయి. పలువురు విద్యార్థులు తాము ఫెయిలయ్యామన్న బాధతో.. తక్కువ మార్కులు వచ్చాయన్న ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారు . విపక్ష పార్టీలు ఈ ఇంటర్ ఫలితాల అంశాన్ని రాజకీయంగా తీసుకుని ఆందోళనలు ప్రారంభించాయి.
Also Read: తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని మృతి... ఫస్టియర్ లో ఫెయిల్ అవ్వడంతో ఆత్మహత్య ..!
కరోనా కాలంలో విద్యార్థులకు సరిగ్గా పాఠాలు చెప్పలేకపోయినందున ఈ సారికి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులందర్నీ పాస్ చే్యాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఈ అంశంపై సమీక్ష నిర్వహించిన ఉన్నత విద్యా శాఖ అధికారులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందర్నీ పాస్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్, కెరియర్ కోసమే తాము పరీక్షలు పెట్టామని.. తామేదో తప్పు చేసినట్లుగా నిందించడం సరి కాదని సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా సమయం అయినప్పటికీ విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌తో పాటు టీవీ చానల్స్‌లో... వెబ్ సైట్లలోనూ పాఠాలు చెప్పామన్నారు.
అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించామన్నారు. విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించిన వారు ఎంతో మంది ఉన్నారని..90 శాతానికిపైగా మార్కులు సాధించిన వారు 10వేలకుపైగా ఉన్నారని మంత్రి సబితాఇంద్రారెడ్డి గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్ కోసమే ఆలోచించాలి కానీ రాజకీయ పార్టీలు.. రాజకీయం చేయకూడదని మంత్రి హితవు పలికారు., విద్యార్థుల భవిష్యత్ గురించే అందరూ ఆలోచించాలన్నారు. రాజకీయ పార్టీలు .. ప్రభుత్వం, ఇంటర్ బోర్డుపై ఆరోపణలు చేస్తూ ధర్నాలు చేయడాన్ని మంత్రి తప్పు పట్టారు.
Also Read: Inter Results 2021: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల... రిజెల్ట్స్ కోసం ఇలా చెక్ చేసుకోండి
పరీక్షలు పాస్ అయిన వారి మార్కులు యథాతథంగా ఉంటాయి. ఫెయిలైన వారికి మాత్రం పాస్ మార్కులు కేటాయించే అవకాశం ఉంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా విద్యార్థుల్ని పరీక్షలు లేకుండా పాస్ చేస్తూ వస్తున్నారు. ఈ సారి పరీక్షలు పెట్టడంతో ఎక్కువ మంది ఫెయిలయ్యారు. చివరికి అందర్నీ పాస్ చేయాల్సి వచ్చింది.
Also Read: కరోనా కాలం చదవులా ? ఇంటర్ బోర్డు పొరపాటా? వివాదంగా మారిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు !
TS EAMCET 2022 Counselling Schedule: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలు ఇవే!
CM Jagan Review : రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్, సీఎం జగన్ ఆదేశాలు
TS EAMCET 2022 Toppers: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో టాపర్లు వీరే!
JEE Advanced 2022 Registration: నేటితో జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుకు ఆఖరు, ఈ సమయం వరకే అవకాశం!
TS ECET Results 2022: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!
Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?
TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?
Google Surprises To RRR Team : 'ఆర్ఆర్ఆర్' టీమ్‌కు గూగుల్ సర్ప్రైజ్
Salman Rushdie: ఎవరీ సల్మాన్ రష్దీ? ఆయన రాసిన బుక్ ఎందుకు వివాదాస్పదమైంది?