AP LAWCET - 2024 Halltickets: ఏపీలాసెట్ 2024 పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
AP LAWCET 2024: ఏపీ లాసెట్/ పీజీఎల్‌సెట్ 2024 ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. జూన్ 9న లాసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
AP LAWCET 2024 Halltickets: ఏపీలోని లా కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి ఏపీ లాసెట్/ పీజీఎల్‌సెట్ 2024 పరీక్ష హాల్‌టికెట్లను జూన్ 3న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు/పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 9న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏపీ లాసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని జూన్ 10న విడుదల చేయనున్నారు. ఆ తర్వాత జూన్ 11 నుంచి జూన్ 12 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఫైనల్ కీతోపాటు లాసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
AP LAWCET - 2024 హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
➥ ఏపీలాసెట్ హాల్‌టికెట్ల కోసం మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx
➥ అక్కడ హోంపేజీలో కనిపించే హాల్‌టికెట్లకు సంబంధించిన Download Hallticket లింక్‌పై క్లిక్ చేయాలి.
➥ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబరు/పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి.
➥ కంప్యూటర్ స్క్రీన్ మీద అభ్యర్థులకు సంబంధించిన హాల్‌టికెట్లు కనిపిస్తాయి.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్షరోజు హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఫొటో ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
ఏపీ లాసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
లాసెట్ పరీక్ష విధానం:
➥ మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. వీటిలో పార్ట్-ఎ: జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ 30 ప్రశ్నలు-30 మార్కులు, పార్ట్-బి: కరెంట్ ఎఫైర్స్ 30 ప్రశ్నలు-30 మార్కులు, పార్ట్-సి: ఆప్టిట్యూడ్ (స్టడీ ఆఫ్ లా) 60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. పార్ట్-సిలో బేసిక్ లా ప్రిన్సిపుల్స్, భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.
➥ ఐదేళ్ల లా కోర్సు పరీక్ష రాసేవారికి ఇంటర్ స్థాయిలో, మూడేళ్ల లా కోర్సు పరీక్ష రాసేవారికి డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. అభ్యర్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో కనీసం అర్హత మార్కులను 35 శాతం అంటే 42 మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు. పరీక్ష సమయం 90 నిమిషాలు.
పీజీఎల్‌సెట్ పరీక్ష విధానం:
మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. పరీక్షలో మొత్తం 2 సెక్షన్లు (పార్ట్-ఎ, పార్ట్-బి) ఉంటాయి. ఇందులో పార్ట్-ఎ నుంచి 40 పశ్నలు, పార్ట్-బి నుంచి 80 పశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే పరీక్ష ఉంటుంది. పరీక్షలో అర్హత మార్కులను 25 శాతంగా (30 మార్కులు) నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి కనీస మార్కులు లేవు.
ముఖ్యమైన తేదీలు...
➥ నోటిఫికేషన్ వెల్లడి: 22.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.04.2024.
➥ రూ.500 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 03.05.2024.
➥ రూ.1000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 11.05.2024.
➥ రూ.2000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 20.05.2024.
➥ రూ.3000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 29.05.2024.
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 30.05.2024 - 01.06.2024.
➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 03.06.2024 నుంచి.
➥ పీజీఈసెట్ పరీక్ష తేది: 09.05.2024 వరకు. (పరీక్ష సమయం: మ. 02.30 గం. . సా. 4.00 గం. వరకు.)