Courses After Inter MPC: ఇంటర్ ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్ తో పాటూ మంచి కెరీర్ ఇచ్చే కోర్సులు ఇవే
New Courses After MPC: ఎంపీసీ తర్వాత ఇంజినీరింగ్ కు ఏ మాత్రం తీసిపోని, విద్యార్థులకు బంగారు భవిష్యత్తునిచ్చే కోర్సులు ఎన్నెన్నో ఉన్నాయి.
Curses are available after Inter MPC: ఒకప్పుడు ఎంపీసీ.. తర్వాత ఇంజినీరింగ్ తప్ప వేరే ఆలోచనే ఉండేది కాదు..విద్యార్థులకు, వారి తల్లిదండులకు కూడా. కానీ ఎంపీసీ తర్వాత ఇంజినీరింగ్ కు ఏ మాత్రం తీసిపోని, విద్యార్థులకు బంగారు భవిష్యత్తునిచ్చే కోర్సులు ఎన్నెన్నో ఉన్నాయి.
ఒక్క మెడిసిన్, దాని సంబంధిత విభాగాల్లో తప్ప ఎంపీసీ తర్వాత దాదాపు అన్ని రకాల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ చేరవచ్చు. ఎంపీసీ చేసినవారికి ఇంజినీరింగ్ కాకుండా టీచింగ్, అకౌంటింగ్, మానేజ్మెంట్ వంటి రంగాలను ఎంచుకున్నా మంచి భవిష్యత్తు సొంతమవుతుంది.
ఇంజినీరింగ్
ఎంపీసీ తర్వాత డైరెక్ట్ ఇంజినీరింగ్ లో చేరటం డీఫాల్ట్ ఆప్షన్ అయిపోయింది. ఐఐటీ-జేఈఈ స్కోర్లుతో దేశవ్యాప్తంగా కోర్సు అందుబాటులో ఉంది. బీటెక్ తర్వాత కూడా ఎన్నో రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉండటం మూలాన విద్యార్థులు ఎక్కువగా ఈ కోర్సులో చేరటానికి ఇష్టపడుతారు. ఇంటర్ తర్వాత డైరెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లో చేరే అవకాశం కూడా ఉంది. ఇందువల్ల ఒక సంవత్సర కాలం సేవ్ అవుతుంది. ఐటీ రంగంలో అభివృద్ధి కారణంగా ఈ మధ్య ఎక్కువగా ఇంజినీరింగ్ లో కంప్యుటర్ సైన్సెస్ బ్రాంచ్ నే ఎంచుకుంటున్నారు. కొన్ని సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటల్లిగెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. బీటెక్ తర్వాత ఫారెన్ కంట్రీస్ కూడా మంచి అవకాశాలు కల్పిస్తుండటంతో ఎక్కువమంది ఇంజినీరింగ్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు.
ఆర్కిటెక్చర్
క్రియేటివ్ కోర్సు అనగానే గుర్తొచ్చేది ఆర్కిటెక్చర్. నిర్మాణరంగం క్రియేటివ్ గా ఆలోచించే విద్యార్థులకు బాగా సూట్ అవుతుంది. పైగా ఈ రంగానికి ఇపుడున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. బ్యాచలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో చేరాలంటే, జాతీయ స్థాయిలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గుర్తింపు పొందిన కాలేజీల్లో నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) అనే ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్ లో 50 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఈ కోర్సులో చేరటానికి అర్హులు. ఎంట్రన్స్ పరీక్ష ప్రతి సంవత్సరం జనవరిలో ఉంటుంది.
హోటల్ మానేజ్మెంట్
నేషనల్ లెవల్లో టూరిజం శాఖ పరిధిలో హోటల్ మానేజ్మెంట్ క్యాంపస్ లు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సులో చేరటానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ..నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మానేజ్మెంట్-జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జాం నిర్వహిస్తుంది. టూరిజం శాఖా పరిధిలోని ప్రభుత్వ కాలేజీలే కాకుండా ప్రైవేటు కాలేజీల్లో కూడా హోటల్ మానేజ్మెంట్, హాస్పిటాలిటీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
'లా'
న్యాయవిద్యలో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇంటర్ తర్వాత లా సెట్ రాసి ఎల్ ఎల్ బీ కోర్సులో చేరవచ్చు. అలా కాకుండా జాతీయ స్థాయిలో క్లాట్ అనే ఎంట్రన్స్ పరీక్షలో స్కోరు సంపాదిస్తే ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్ ఎల్ బీ కోర్సులో చేరవచ్చు.
బ్యాచలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
ఫ్యాషన్ రంగం ఎప్పటికప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంది. ఈ రంగలో ఆసక్తి ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. బ్యాచలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులో చేరాలనుకునే వారు నిఫ్ట్ క్యాంపస్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎంట్రన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.