అన్వేషించండి

Vizag GST Scam: కంపెనీలు పెట్టి వ్యాపారం చేయకుండానే రూ.1700 కోట్లు కొట్టేశారు- మైండ్ బ్లాంక్ చేసే జీఎస్టీ స్కామ్ - వైజాగ్‌ నుంచే!

Fake Invoice Scam: విశాఖలో వెలుగుచూసిన రూ. 1,700 కోట్ల భారీ జీఎస్టీ ఇన్వాయిస్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ ఫేక్ ఇన్వాయిస్ మాయాజాలం ఏమిటి? ప్రభుత్వ ఖజానాకు ఎలా కన్నం వేస్తారు?

Input Tax Credit Scam:  దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ, పన్ను ఎగవేతకు పాల్పడుతున్న భారీ నెట్‌వర్క్‌ను విశాఖపట్నం జీఎస్టీ నిఘా విభాగం బట్టబయలు చేసింది. సుమారు  1,700 కోట్ల రూపాయల  విలువైన నకిలీ ఇన్వాయిస్‌లను సృష్టించి, ప్రభుత్వ ఖజానాకు 264 కోట్ల రూపాయల  గండి కొట్టిన ఈ కుంభకోణంలో మాస్టర్ మైండ్ దంట్ల ఆదిరెడ్డి అలియాస్ అంజిరెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇతనిని అత్యాధునిక  ఫైనాన్షియల్ ట్రాకింగ్ సాంకేతికత ద్వారా పట్టుకున్నారు. 

 ఏమిటీ ఫేక్ ఇన్వాయిస్ స్కామ్? 

సాధారణంగా వ్యాపారస్తులు తాము కొనుగోలు చేసిన వస్తువులపై చెల్లించిన పన్నును ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ రూపంలో తిరిగి పొందుతారు. దీనిని అడ్డం పెట్టుకుని అంజిరెడ్డి వంటి మోసగాళ్లు ఎటువంటి వస్తువుల సరఫరా లేకుండానే కేవలం కాగితాల మీద  నకిలీ ఇన్వాయిస్‌లు  సృష్టిస్తారు. అంటే, వ్యాపారం జరిగినట్లు నమ్మించి, ప్రభుత్వం నుంచి అక్రమంగా డబ్బును , పన్ను మినహాయింపును పొందుతారు. విశాఖ కేసులో ఇలా ఏకంగా 92 నకిలీ కంపెనీలను  సృష్టించి ఈ దందా సాగించారు.

 అమాయకులే బాధితులు 

ఈ స్కామ్ వెనుక ఉన్న అత్యంత భయంకరమైన అంశం ఏమిటంటే.. నిరుపేదలు, అమాయకుల ఆధార్, పాన్ కార్డుల దుర్వినియోగం. చిన్నపాటి ఆర్థిక సాయం చేస్తామనో లేదా ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామనో నమ్మించి సేకరించిన ఈ పత్రాలతో అంజిరెడ్డి బోగస్ కంపెనీలను రిజిస్టర్ చేశాడు. ఆ కంపెనీలకు ఆయా బాధితులే యజమానులని రికార్డుల్లో చూపిస్తూ, అసలు సూత్రధారులు వెనుక ఉండి వేల కోట్ల లావాదేవీలు నడిపించారు. దీనివల్ల రేపు చట్టపరమైన సమస్యలు వస్తే ఆ అమాయకులే బలిపశువులవుతారు.

 జీఎస్టీ చట్టం ప్రకారం తీవ్ర నేరం 

జీఎస్టీ చట్టం సెక్షన్ 132 ప్రకారం.. ఎటువంటి వస్తువులు లేదా సేవలు సరఫరా చేయకుండా నకిలీ ఇన్వాయిస్‌లు జారీ చేయడం, తప్పుడు ఐటీసీ  పొందడం నాన్-బెయిలబుల్ నేరం. ఈ స్కామ్‌లో రూ. 5 కోట్లకు మించి పన్ను ఎగవేత జరిగితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష మరియు భారీ జరిమానా విధిస్తారు. విశాఖ స్కామ్‌లో ఎగవేత మొత్తం రూ. 264 కోట్లుగా ఉన్నందున, నిందితులకు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే అక్రమంగా పొందిన ఐటీసీని రికవరీ చేసే ప్రక్రియను ప్రారంభించింది.

 ఆర్థిక ఉగ్రవాదంపై ఉక్కుపాదం 

నకిలీ ఇన్వాయిస్‌ల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దారి మళ్లించడం ఒక రకమైన  ఆర్థిక ఉగ్రవాదం అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సొమ్మును తరచుగా మనీ లాండరింగ్ లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వాడుతుంటారు. విశాఖ DGGI అధికారులు కేవలం అంజిరెడ్డితో ఆగకుండా, ఈ నకిలీ ఇన్వాయిస్‌లను కొనుగోలు చేసి లాభపడిన ఇతర కంపెనీల యజమానుల కోసం కూడా గాలింపు ముమ్మరం చేశారు. మున్ముందు ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.                                          

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
Jogi Ramesh Latest News:వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?
వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget