Gangster Shot Dead: కోర్టులోనే గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య, లాయర్ల వేషంలో వచ్చి దుండగుల కాల్పులు
Gangster Shot Dead: లఖ్‌నవూ కోర్టులో ఓ గ్యాంగ్‌స్టర్‌ని దుండగులు కాల్చి చంపారు.
![Gangster Shot Dead: కోర్టులోనే గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య, లాయర్ల వేషంలో వచ్చి దుండగుల కాల్పులు Uttar Pradesh Gangster Sanjeev Jeeva aide of Mukhtar Ansari shot dead in Lucknow court Gangster Shot Dead: కోర్టులోనే గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య, లాయర్ల వేషంలో వచ్చి దుండగుల కాల్పులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/07/b4385a7affbb73c96d0c6a57ee9e54d71686138013281517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gangster Shot Dead:
లఖ్‌నవూ కోర్టులో ఘటన..
యూపీలో షాకింగ్ ఘటన జరిగింది. కోర్టులోనే ఓ గ్యాంగ్‌స్టర్‌ని కాల్చి చంపేశారు. ముక్తార్ అన్సారీకి రైట్‌హ్యాండ్ అయిన సంజీవ్ జీవాను లఖ్‌నవూ కోర్టులోనే తుపాకులతో కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో ఓ పోలీస్‌తో పాటు బాలికకి కూడా గాయాలయ్యాయి. ఓ క్రిమినల్ కేసు విచారణలో భాగంగా సంజీవ్ జీవాను లఖ్‌నవూ కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. ఉన్నట్టుండి కొందరు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పులు జరిపిన వాళ్లు లాయర్ల వేషంలో వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. సంజీవ్‌ను చంపిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పెద్ద ఎత్తున కోర్టు చుట్టూ మొహరించారు. కంపౌండర్‌గా కెరీర్ ప్రారంభించిన సంజీవ్ జీవా ఆ తరవాత గ్యాంగ్ వార్‌లోకి దిగాడు.
#WATCH | Uttar Pradesh: Gangster Sanjeev Jeeva shot outside the Lucknow Civil Court. Further details awaited
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 7, 2023
(Note: Abusive language) pic.twitter.com/rIWyxtLuC4
#WATCH | Injured police official brought to Civil Hospital in Lucknow. pic.twitter.com/B3blORgDQ6
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 7, 2023
యూపీలో ఇటీవలే గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ హత్య సంచలనమైంది. ఉమేశ్ పాల్ హత్య కేసులో అరెస్టై జైలులో ఉన్న అతీక్ అహ్మద్ ను మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్తుండగా కొందరు దుండగులు సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతీక్ తో పాటు అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్ కూడా చనిపోయాడు. మరోవైపు గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ను పోలీసులు గురువారం ఎన్కౌంటర్ చేయడం తెలిసిందే. అది జరిగిన మూడో రోజే గ్యాంగ్ స్టర్ ఫ్యామిలీలో మరో ఇద్దరు వ్యక్తులు కాల్పుల ఘటనలో చనిపోయారు.
Also Read: Cardiologist Death: 16 వేల హార్ట్ సర్జరీలు చేసిన కార్డియాలజిస్ట్‌కి గుండెపోటు, నిద్రలోనే మృతి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)