Mahabubabad News: ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి - పరారీలో పేరెంట్స్
Telangana News: ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. తల్లిదండ్రులు పరారీలో ఉండగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![Mahabubabad News: ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి - పరారీలో పేరెంట్స్ two children suspicious death in garla in mahabubabad Mahabubabad News: ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి - పరారీలో పేరెంట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/10/6c330ab02073ed1242f0c2cdad06ab931710065267219876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Two Children Suspicious Death in Mahabubabad: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గార్ల మండలం అంకన్నగూడెంలో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బయ్యారం మండలం నామాలపాడులో అనిల్, దేవి అనే దంపతులు తమ పిల్లలు లోహిత (3), జశ్విత (1)తో కలిసి ఉంటున్నారు. వారం క్రితం అనిల్ తమ స్వగ్రామం అంకన్నగూడేనికి కుటుంబంతో కలిసి వచ్చాడు. అతని తండ్రి వెంకన్న స్థానికంగా కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఆదివారం తెల్లవారుజామున షాపునకు వెళ్లిన వెంకన్న.. తిరిగి ఉదయం 10 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో చూడగా ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా పడి ఉన్నారు. కొడుకు, కోడలు కనిపించలేదు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారుల మృతదేహాలను పరిశీలించారు. పిల్లలు తాగే పాలలో విషం కలిపి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Telangana Woman: ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళ దారుణ హత్య - చెత్తబుట్టలో మృతదేహం లభ్యం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)