Telangana: రెండు బైకులు ఢీకొని, ఒకరు మృతి నలుగురికి గాయాలు
రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.
విద్యార్థులకి ఎన్నో ఆశయాలు ఉంటాయి. బాగా చదువుకొని.. ఉద్యోగం సంపాదించాలని.. తల్లిదండ్రులని బాగా చూసుకోవాలని ఇలా చాలా ఆశలతో చదవు ప్రయాణాన్ని సాగిస్తారు. ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకి మరింతగా ఎక్కువగా ఉంటాయి. అలాంటి లక్ష్యాలను సాధించాలని ఓ కాలేజ్లో చదువుతూ.. పరీక్షలు రాసేందుకు వేరే కాలేజ్ కు ఉత్సహంగా వెళ్లారు. తిరిగి వారి ఇంటికి చేరేందుకు బైక్ ఎక్కారు. విధి వారి జీవిత ప్రయాణాన్ని ఆపివేయాలని అనుకుందో ఏమో.. రెండు బైకులు ఢీ కొట్టగా ఒకరు మృతి చెందగా.... నలుగురు గాయపడ్డారు. మరికొంత మందికి బాధను మిగిల్చింది. వారు ఎక్కిన బైక్ ప్రమాదవశాత్తు మరో బైక్ ను ఢీకొంది.
ఎన్నో కలలతో భవిష్యత్తును ఊహించుకున్న విద్యార్థులు కానరాని లోకాలకు వెళ్లిపోయారు.. ఊహించని రోడ్డు ప్రమాదం ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. మరో బైక్ రూపంలో మృత్యువు ముగ్గురు విద్యార్థులను కబలించింది..ఒకే కాలేజీకి చెందిన ముగ్గురు, మరో ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు చనిపోగా...మిగిలిన నలుగురు గాయపడ్డారు. చనిపోయిన వారి కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి..తోటి మిత్రులందరు దిగ్భ్రాంతికి గురయ్యారు.. తమ స్నేహితుడు, మరో నలుగురు హాయపడంతో వారి గ్రామంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
వీరంతా వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో ఎస్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నారు. ఉదయాన్నే ఇంటి నుంచి కాలేజీకి బయలుదేరారు. కాలేజీ ముగించుకొని అనంతరం ఇంటికి వెళ్లే సమయంలో రెండు బైకులు ఢీ కొని ఒకరు ప్రాణాలు కోల్పోగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపింది.
మరణించిన వారిలో ఒకరు ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే నలుగురు విద్యార్థులు గాయపడగా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందడంతో ఆ ప్రాంతమంతా మిత్రుల రోదనలతో శోక సముద్రంగా మారిపోయింది. రోడ్డు ప్రమాదం విద్యార్థుల జీవితాలకు చరమగీతం పాడింది.
హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఎస్ ఆర్ ఇంజనీరంగ్ కాలేజీలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు.
రెండు బైకులు ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లు స్థానికులు వెల్లడించారు.