అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Wrong GPS: జీపీఎస్ తప్పిదంతో ప్రమాదం - నిర్మాణంలో వంతెనపై నుంచి పడిన కారు, ముగ్గురు మృతి

UP News: జీపీఎస్ తప్పిదంతో ఓ కారు నిర్మాణంలోని వంతెనపై నుంచి నదిలో పడిపోయిన ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Car Fell From Bridge Due To Wrong GPS In Bareilly: జీపీఎస్ (GPS) నావిగేషన్ తప్పిదం ముగ్గురి ప్రాణాలు తీసింది. నావిగేషన్ మ్యాప్ తప్పుగా చూపించడంతో ఓ కారు నిర్మాణంలో వంతెనపై నుంచి పడిన ఘటన యూపీలోని (UP) బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు బరేలీ నుంచి బదౌన్ జిల్లాలోని డేటాగంజ్‌కు జీపీఎస్ సాయంతో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఖల్పూర్ - దతాగంజ్ రహదారిపై వేగంగా ప్రయాణించిన కారు నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి రామగంగా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారులోంచి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నావిగేషన్ పొరపాటు వల్లే నిర్మాణంలో వంతెనపైకి కారు చేరినట్లు తెలుస్తోంది. కాగా, కొన్ని నెలల కిందట భారీ వరదల కారణంగా నిర్మాణంలోని వంతెన ముందు భాగం నదిలో కూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీని గురించి జీపీఎస్‌లో మార్పు చేయకపోవడంతో నావిగేషన్ మ్యాప్‌లో తప్పుగా చూపించిందని వెల్లడించారు. అలాగే, వంతెన ప్రదేశం వద్ద కూడా ఎలాంటి హెచ్చరిక బోర్డులూ లేవని.. దీంతో కారు తప్పుదారిలో ప్రయాణించినట్లు చెప్పారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మరో ఘటనలో ముగ్గురు

అటు, ఇదే యూపీలోని సంభాల్‌లో చెలరేగిన హింసలో ముగ్గురు మృతి చెందారు. కోర్టు ఆదేశాలతో ఓ ప్రార్థనా మందిరంలో సర్వే నిర్వహిస్తోన్న క్రమంలో స్థానికులు, పోలీసులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. చాలామంది పోలీసులు సైతం తీవ్రంగా గాయపడ్డారు. న్యాయస్థానం ఆదేశాలతో సర్వే తలపెట్టిన బృందానికి స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. వందలాది మంది స్థానికులు గుమిగూడి పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. పదుల సంఖ్యలో పోలీసులు, అధికారుల వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో ఘటనా స్థలికి భారీగా చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు యత్నించారు. టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Also Read: US Stundents : అమెరికాలో భారత విద్యార్థులకు పార్ట్‌టైమ్ జాబ్స్ కష్టమే - బేబీ సిట్టర్స్‌గా మారిపోతున్నారు !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Embed widget