US Stundents : అమెరికాలో భారత విద్యార్థులకు పార్ట్‌టైమ్ జాబ్స్ కష్టమే - బేబీ సిట్టర్స్‌గా మారిపోతున్నారు !
US Dreams : విద్యార్థుల అమెరికా కలలు కరిగిపోతున్నాయి. ఎన్నో ఆశలతో అక్కడికి పోయిన వారు బేబి సిట్టర్లుగా మారాల్సి వస్తోంది. ఉద్యోగాలు దొరకడం లేదు.
Jobs tough to come by Indian students in US turn babysitters: భారత్‌లో పుట్టి కాస్త బాగా చదువుకనేవారి ప్రతి ఒక్కరి కల అమెరికా పోవడం. డాలర్లు సంపాదించడం. విద్యార్థులకు అ ఆశలు ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులకు మాత్రం ఉంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను అమెరికా పంపడమే లక్ష్యంగా చదివిస్తూ ఉంటారు. ఎందుకంటే అమెరికా పోతే డాలర్లే డాలర్లు అని అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి గోల్డెన్ డేస్ పోయాయని ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఉన్నాయని అక్కడుకు వెళ్లిన వారి అనుభవాలు చెబుతున్నాయి.
విద్యార్థులకు పార్ట్ టైమ్ జాబ్స్ కూడా దొరకట్లేదు !
ప్రతి ఏటా కొన్ని వేల మంది తెలుగు విద్యార్థులు ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్తున్నారు. వీరిలో ఒక్కొక్కరు కనీసం రూ. యాభై లక్షల నుంచి రూ.కోటి వరకూ ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అక్కడుకు వెళ్లిన తర్వాత ఆరు నెలలవరకు ఎలాగోలా గడిపినా తర్వాత పార్ట్ టైమ్ జాబ్ చూసుకోవాల్సిదే. అక్కడి చట్టాల ప్రకారం లీగర్ గా.. వారు చదువుకుంటున్న క్యాంపస్ లో ఏమైనా పార్ట్ టైమ్ ఉంటే చేసుకోవచ్చు. లేకపోతే లేదు. అందుకే ఇల్లీగల్ గా ఎక్కువ మంది బయట పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూంటారు. ఇప్పుడు అవి కూడా దొరకడం లేదని అక్కడి విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు.
బేబి సిట్టర్స్ గా మారిపోతున్న విద్యార్థులు
కొంత మంది విద్యార్థులు తమ ఖర్చుల కోసం ఫ్లాట్ రెంట్స్ కోసం అయినా ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో బేబీ సిట్టర్స్‌గా పనిచేసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. గంటకు పది నుంచి పదమూడు డాలర్లు వస్తూండటంతో కొంత మంది ఆ పని చేస్తున్నారు. దీంతో ఇంటి అద్దెలు అయినా వస్తున్నాయని అనుకుంటున్నారు. పరిస్థితులు ఇలా ఉన్నా.. ఇప్పటికీ కొన్ని లక్షల మంది విద్యార్థులు అమెరికా వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికా కూడా విద్యార్థులకు వీసాలు ఇస్తోంది. కానీ చదువు అయిపోయిన తరవాత వారి వారి స్వదేశాలకు పంపేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
Also Read: టాయిలెట్‌లో ఫోన్ చూస్తూ కూర్చుంటే అక్కడ క్యాన్సర్ రావొచ్చు - సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు
చదువు అయిపోయాక ఉద్యోగాలు రావడం గగనం !
ప్రస్తుతం అమెరికాలో ఉన్న పరిస్థితుల్లో వంద మందిలో సగం మందికి కూడా ఉద్యోగాలు రావడం గగనంగా మారింది. మామూలు ఉద్యోగాలు చేస్తే హెచ్‌వన్ బీ వీసా వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో ఉండగలిగేలా సంపాదించే ఉద్యోగం తెచ్చుకోవాలంటే గనగనంగా మారుతోంది. ఇటీవలి కాలంలో చదువులు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం కోసం వెళ్లిన వారు కూడా అక్కడ ఉద్యోగం పోతే ఆరు నెలల్లో వేరే ఉద్యోగం చూసుకోకపోతే అమెరికా నుంచి వెళ్లిపోయేలా చట్టాలు చేశారు. పరిస్థితి చూస్తూంటే రాను రాను అమెరికా భూతల స్వర్గం ఏ మాత్రం కాబోదన్న అంచనాలు వస్తున్నాయి.