Sidhu True Husband: మగ సావిత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ - దాదాపుగా చనిపోయిన భార్యను బతికించుకున్న వైనం తెలిస్తే మీరే ఒప్పుకుంటారు !
Navjot Singh Sidhu: ఆయన భార్యకు క్యాన్సర్ స్టేజ్ 4 అని డాక్టర్లు తేల్చేశారు. బతకడం కష్టం ఇంటికి తీసుకెళ్లిపొమ్మన్నారు. అలాగే తీసుకెళ్లారు.కానీ బతికించుకున్నాడు ఆ భర్త. ఆయనే నవజ్యోత్ సింగ్ సిద్దూ.
Former cricketer Siddhu saved his wife who was in the last stage of cancer: భర్త ప్రాణాలను తీసుకపోతున్న యముడి వెంట పడి మరీ తన భర్త ప్రాణాలను తిరిగి కాపాడుకున్నారని సతీ సావిత్రి గురించి పురాణాలలో చదువుకున్నాం. అలాంటి క్యారెక్టర్ నిజ జీవితంలో ఉంటే ...అది మగాడి రూపంలో ఉంటే ఖచ్చితంగా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ రూపంలోనే ఉంటారు. ఎందుకంటే దాదాపుగా చనిపోయిన ఆయన భార్యను సిద్దూ కాపాడుకున్నారు. అలా ఇలా కాదు. ఆయన చేసిన పోరాటం మాత్రం అనన్య సామాన్యం. ఎలా అంటే.. ప్రతి క్షణంలోనూ ఆమె ప్రాణాన్ని యముడు తీసుకెళ్తూంటే ఎప్పటికప్పుడు అడ్డం పడి వెనక్కి తెచ్చుకున్నారు.
సిద్ధూ భార్య పేరు నవజ్యోత్ కౌర్. ఆమెకు కొన్నాళ్ల క్రితం క్యాన్సర్ వచ్చింది. మొదట్లో గుర్తించారు. చికిత్స చేయించారు. తగ్గిపోయిందని అనుకున్నారు. కానీ కుమారుడి పెళ్లి తర్వాత ఆమె అనారోగ్యం ఒక్క సారిగా తిరగబెట్టింది. టెస్టులు చేయిస్తే.. .స్టేజ్-3 కి వచ్చేశారని చెప్పారు. అయినా పట్టు వదలకుండా చికిత్స చేయించారు. కానీ ఫలితం లేకపోయిది. స్టేజ్ 4కు క్యాన్సర్ వెళ్లిపోయింది. ఇక డాక్టర్లు బతకదని తేల్చేసారు. కేవలం మూడు శాతం మాత్రమే చాన్స్ ఉందని .. చికిత్స కూడా వృధా అని చెప్పి పంపేశారు.
Also Read: టాయిలెట్‌లో ఫోన్ చూస్తూ కూర్చుంటే అక్కడ క్యాన్సర్ రావొచ్చు - సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు
అయితే సిద్దూ మాత్రం ఎక్కడా నిరాశపడలేదు. భార్యను ఇంటికి తీసుకెళ్లి వైద్యం కొనసాగించారు. ఈ సారి పూర్తిగా వైద్యుల మీదే ఆధారపడకుండా కొన్ని ప్రత్యేకమైన చికిత్సా పద్దతులను అవలభించారు. క్రమశిక్షణ, కఠినమైన జీవనశైలి, సరైన ఆహార నియమాలను అనుసరించి క్యాన్సర్‌పై పోరాడారు. ఆయుర్వేద పద్ధతులు, ప్రత్యేకమైన ఆహార నియమాలు నవజ్యోత్ కౌర్ చికిత్సలో కీలకంగా మారాయి. నిమ్మరసం, పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేప ఆకులు, తులసి వంటి ఆహార పదార్థాలను ఆమె పద్దతిగా తీసుకుంటూ వచ్చారు.
అలాగే, గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్‌రూట్, వాల్‌నట్‌తో తయారు చేసిన జ్యూస్‌లను కూడా ఆహారంలో భాగం చేసుకున్నారు. ఆమె ఆహారంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్న పదార్థాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వంటలకు కొబ్బరి నూనె, కోల్డ్ ప్రెస్డ్ నూనెలు లేదా బాదం నూనె మాత్రమే ఉపయోగించారని, ఉదయం టీలో దాల్చిన చెక్క, లవంగాలు, బెల్లం, యాలకులు తీసుకున్నారు. ఈ మొత్తం చికిత్సను సిద్దూనే దగ్గరుండి చూసుకున్నారు.
వైద్యులు కూడా ఆశ్చర్యపోయే రీతిలో నవజ్యోత్ కౌర్ క్యాన్సర్ నుండి కోలుకున్నారు. ఈ విషయాన్న సిద్దూ అధికారికంగా తెలిపారు. తన భార్య క్లినికర్ గా క్యానర్‌ను జయించారని ప్రకటించారు.
My wife is clinically cancer free today ….. pic.twitter.com/x06lExML82
— Navjot Singh Sidhu (@sherryontopp) November 21, 2024
సిద్దూపోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నో మరణ క్షణాల నుంచి యముడితో పోరాడినట్లుగా పోరాడి భార్యను కాపాడుకున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు.