Misterious Murders: చరిత్రలో ఈ వ్యక్తులతో ముడిపడి ఉన్న హత్యలు ఇంకా మిస్టరీనే!
Crime News: ప్రపంచానికి క్రైమ్ పట్ల ఉండే ఆకర్షణ అంతా ఇంతా కాదు. సినిమా, ఓటీటీ, నవలలు, మీడియాలో నేరాల గురించి తెలుసుకోవటానికి ప్రజలు చూపిస్తున్న ఇంట్రెస్టే దీనికి నిదర్శనం.
Misterious Murders: ప్రపంచానికి క్రైమ్, క్రైమ్ న్యూస్ పట్ల ఉండే ఆకర్షణ అంతా ఇంతా కాదు. సినిమా, ఓటీటీ, నవలలు, మీడియాలో నేరాల గురించి తెలుసుకోవటానికి ప్రజలు చూపిస్తున్న ఇంట్రెస్టే దీనికి నిదర్శనం. ఇది కొత్తది కాదు. కానీ దురదృష్టవశాత్తు, ఇపుడు చెప్పుకోబోయేవి నిజమైన మర్డర్స్ గురించి. హత్యలు మానవాళిని మొదటి నుంచీ వెంటాడుతూనే ఉన్నాయి. హత్య అనేది సమాజంలోని అట్టడుగు స్థాయి వ్యక్తులకు మాత్రమే పరిమితం కాదు. హోదాతో సంబంధం లేకుండా హత్యలకు ప్రభావితులైన వారు ఎందరో ఉన్నారు. చరిత్రలో వారి గొప్ప స్థానాలు ఉన్నప్పటికీ, ఈ ప్రముఖులు, ఉద్దేశపూర్వకంగా లేదా ఇతరత్రా హత్య కేసుల్లోకి లాగబడ్డారు.
చార్లెస్ అగస్టస్ లిండ్‌బర్గ్ కుమారుడి హత్య
చార్లెస్ అగస్టస్ లిండ్‌బర్గ్ (ఫిబ్రవరి 4, 1902 - ఆగస్టు 26, 1974) ఒక అమెరికన్ ఏవియేటర్, సైనిక అధికారి. మే 20–21, 1927న, అతను న్యూయార్క్ నగరం నుంచి పారిస్‌కు 3,600 మైళ్ల (5,800 కి.మీ) దూరం, 33.5 గంటల పాటు ఒంటరిగా ప్రయాణించి మొదటి నాన్‌స్టాప్ విమానాన్ని నడిపాడు. చార్లెస్ “లిండీ” లిండ్‌బర్గ్ 1932 నాటికి అంతర్జాతీయ ప్రముఖుడు. అతను పులిట్జర్ బహుమతి పొందిన పుస్తకాన్ని వ్రాసాడు. ప్రపంచాన్ని పర్యటించాడు. ఎయిర్ కార్ప్స్ రిజర్వ్‌లో కల్నల్ అయ్యాడు. అతను 1929లో 'అన్నే మారో'ను వివాహం చేసుకున్నాడు. ఈ జంట మార్చి 1932 లో తమ 20-నెలల కుమారుడు చార్లెస్ జూనియర్‌తో కలిసి న్యూజెర్సీలోని హోప్‌వెల్‌లోని వారి ఎస్టేట్‌లో ఆనదంగా గడుపుతున్న సమయమది.
మార్చి 1వ తేదీ సాయంత్రం, అతని నర్సరీలో చార్లెస్ జూనియర్ లేకపోవడాన్ని అతని నర్సు 'బెట్టీ గౌ' గుర్తించి, చార్లెస్, అన్నేలకు చెప్పింది. నర్సరీ కిటికీలో బెదిరింపు నోట్‌ను వెలికితీసి ఇల్లు, గార్డెన్ లో వెతికారు. పట్టణ, రాష్ట్ర పోలీసులను పిలిచారు. విచారణ జరిగింది. నర్సరీ కిటికీకింద బయట చెదిరిన బురద పాదముద్రలతో పాటు, నర్సరీ ఫ్లోర్‌లో కూడా బురద కనిపించింది. ఒక నిచ్చెన ముక్కలై కనుగొనబడింది.
మరిన్ని బెదిరింపు నోట్లు దొరికాయి. కిడ్నాపర్లు, లిండ్‌బర్గ్‌ల మధ్యవర్తి మధ్య చర్చ ఏప్రిల్ వరకు కొనసాగింది. చివరికి వారు అడిగినట్టుగా $50,000 డాలర్లు పంపారు. అయినప్పటికీ వాగ్దానం చేసిన విధంగా శిశువును మాత్రం తిరిగి ఇవ్వలేదు. మే 12వ తేదీన, లిండ్‌బర్గ్ ఎస్టేట్ నుండి హైవేకి దూరంగా నాలుగున్నర మైళ్ల దూరంలో శిశువు మృతదేహం పాక్షికంగా ఖననం అయినట్లు కనుగొన్నారు. శవపరీక్షలో పిల్లవాడు చనిపోయి దాదాపు రెండు నెలలు అయిందని, అపహరణ జరిగిన రోజు రాత్రి హత్య చేసి ఉంటారని పరిశోధకులు భావించారు. తలకు బలమైన దెబ్బ తగలడం వల్లే మరణానికి కారణమని నిర్ధారించారు.
హ్యారీ ఓక్స్ హత్య
బహామాస్‌లో అతిపెద్ద భూయజమాని అయిన సర్ హ్యారీ ఓక్స్, కెనడియన్ గోల్డ్‌మైన్ సంపదతో అత్యంత ధనవంతుడుగా ఎదిగాడు. జూలై 8, 1943 తెల్లవారుజామున అతని బెడ్‌రూమ్‌లో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. నాసావులోని అతని అందమైన ఎస్టేట్ లో అతను భయంకరమైన హత్యకు గురయ్యడు. సాక్ష్యం రక్తంతో తడిసిన గోడలు, నిప్పంటించినట్లు కనిపించిన అతని శరీరం తప్ప ఇంకేమీ కనపడలేదు.
అనుమానితుల జాబితా చాలా పెద్దది. ఎందుకంటే ఓక్స్ తన క్రూరమైన వ్యాపారం , కొన్నిసార్లు ఇతర వ్యక్తులతో వ్యవహరించే క్రూరమైన పద్ధతుల కారణంగా చాలా మంది శత్రువులు తయారయ్యారు. అతను తన సంపదను చాటుకున్నాడు. బహామాస్ గవర్నర్, మాజీ కింగ్ ఎడ్వర్డ్ VIII, అమెరికన్ సోషలిస్ట్ సింప్సన్‌ను వివాహం చేసుకోవడానికి బ్రిటిష్ సింహాసనాన్ని వదులుకున్నవాడు. అతనితో ఓక్స్ స్నేహం చేసాడు. ఎడ్వర్డ్ తన స్నేహితుడు ఓక్స్ కు ఎప్పుడూ ఎటువంటి సహాయమూ చేయలేదు. ఓక్స్ చనిపోయాక మాత్రం హత్య విచారణను జరుపుతున్నట్టు క్రెడిట్ సంపాదించాడు. ఎడ్వర్డ్, ఓక్స్ ఇద్దరూ అసహ్యించుకునే ఓక్స్ అల్లుడు ఫ్రెడ్డీ మీద అనుమానంగా ఉందని అతన్ని పోలీసులకు పట్టించాడు. సాక్ష్యాధారాలు లేకపోవటంతో అతను నిర్దోషిగా గుర్తించబడ్డాడు. దానితో, ఓక్స్ మరణం ఛేదించలేని మిస్టరీగా మిగిలిపోయింది.
మేయర్లింగ్ సంఘటన
జనవరి 30, 1889 న, ఆస్ట్రో-హంగేరియన్ సింహాసనానికి వారసుడు క్రౌన్ ప్రిన్స్ రుడాల్ఫ్, అతని ప్రియురాలు బారోనెస్ మేరీ వెట్సేరా మృతదేహాలు యువరాజు యాజమాన్యంలోని వేట లాడ్జ్ లో కనిపించాయి. యువరాజు తన పదిహేడేళ్ల ఉంపుడుగత్తెని చంపాడని, చాలా గంటల తరువాత, తనను తానే గన్ తో కాల్చుకున్నట్లు అందరికీ తెలిసింది. అయితే, యువరాజుకు అత్యంత సన్నిహితులు ఈ విషయం నమ్మలేదు. లాడ్జిలో గడుపుతున్న స్నేహితుల ప్రకారం, అతనికి మంచి భవిష్యత్తు ఉంది. ముందు రోజు కూడా ఎంతో హాయిగా ఉన్నాడు. సూసైడ్ చేసుకోవాల్సిన కారణాలేవీ లేవని వారు చెప్పారు. వీరి మరణం ఇంకా మిస్టరీ గానే ఉంది.