Crime News : ఏదైనా పని చేసుకోరా అంటే బ్లాక్ మెయిలింగ్ ట్రై చేశాడు ! కానీ రివర్స్ అయింది
రహస్యంగా వీడియోలు తీసి ప్రేమ జంటల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. నలభై జంటల వీడియోలు అతని ఫోన్‌లో ఉన్నాయి.
Crime News : ఊళ్లలో అల్లరి చిల్లరగా తిరగేవాళ్లు చాలా మంది ఉంటారు. వారికి చాలా మంది సలహాలు ఇస్తూ ఉంటారు. ఎందుకురా ఇలా టైం వేస్ట్ చేసుకుంటావు.. ఏదో ఓ పని చేసుకోవచ్చుగా అని సలహాలిస్తూ ఉంటారు. అలా ఆ యువకుడికి కూడా కొంత మంది సలహాలిచ్చారు. ఏదో ఓ పని అంటే... వాడికేం అర్థమయిందో కానీ.. వాడి చేసిన పని తెలుసుకుని ఊళ్లోవాళ్లంతా పట్టుకుని వీపు పగలగొట్టారు. ఇంతకూ ఆ యువకుడు ఏం చేశాడో తెలుసా ?
ఊరి బయట శవానికి ఉరి! సగం కాలిన స్థితిలో చెట్టుకు వేలాడుతూ - అసలేం జరిగిందంటే
సూర్యాపేట జిల్లా -చివ్వెంల మండలం, ఉండ్రుగొండ గుట్టల అడవులు కాస్త దట్టంగా ఉంటాయి. ఏకాంతంగా గడపడానికి అంతకు మించిన మంచి ప్రదేశం దొరకదని దాన్నో పార్కులా ఉపయోగించుకుంటూ ఉంటారు ప్రేమికులు. వివాహేతర బంధాలు పెట్టుకున్న వాళ్లకీ అదే హాట్ స్పాట్. వాళ్లు చేస్తున్నది తప్పా ఒప్పా అన్న సంగతి పక్కన పెడితే.. వీళ్లనే ఉపయోగించుకుని డబ్బులు గుంజాలని ఆ యువకుడు డిసైడయ్యారు. మంచి కెమెరా ఉన్న సెల్ ఫోన్ కొనుక్కుని తాను ముందుగానే పొదల్లోకి దూరిపోయేవాడు.
లోన్ యాప్ వేధింపులకు ఫైర్ మెన్ బలి! రూ.6 వేల కోసం - రైలు కింద పడి ఆత్మహత్య
తర్వాత తన సమీపంలో ఎవరైనా జంట వచ్చి ప్రేమించుకుని .. కామించుకుంటే వెంటనే చిత్రీకరించేవాడు. తర్వాత వారి గురించి తెలుసుకుని ఆ ఫోటోలు, వీడియోలు చూపిస్తూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగేవాడు. కొంత మంది డబ్బులు ఇవ్వడంతో తన పని బాగుందని అనుకున్నాడు. ఇలా దాదాపుగా నలభై జంటల రహస్య ప్రేమను వీడియో తీశాడు. వారందర్నీ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
రైల్వే ఉద్యోగి భార్య హత్య కేసులో కొత్త కోణం, ఆనాటి ఫోన్ కోసమే మర్డర్!
అయితే ఆ నోటా ఈ నోటా పడి ఈ యువకుడి వ్యవహారం ఊళ్లో తెలిసిపోయింది. దీంతో అందరూ కలిసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదారు. ఫోన్‌లో ఉన్న వీడియోలనూ చూసి ఆశ్చర్యపోయారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన చాలా మంది వ్యవహారాలు అందులో ఉన్నాయి.అవి బయటకు వస్తే కుటుంబాలు..కాపురాలు కూలిపోతాయని వెంటనే డిలీట్ చేసి.. ఆ యువకుడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. చివ్వెంల పోలీసులు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడు ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూరి గ్రామానికి చెందిన రామకృష్ణగా గుర్తించారు.