అన్వేషించండి

Temple Priest Ganja Cultivate: గుళ్లోనే పూలమొక్కల మధ్య గంజాయి సాగు - ఈ పూజారి నిర్వాకం చూస్తే అవాక్కవాల్సిందే!

Temple Priest Ganja: భక్తి ముసుగులో గంజాయి సాగు చేస్తున్న పూజారి నిర్వాకం నారాయణఖేడ్‌లో వెలుగు చూసింది. పోలీసులు ఇలా జరిగదని అనుకున్నారు కానీ తీరా రెయిడ్ చేస్తే రూ. 70 లక్షల విలువైన గంజాయి దొరికింది.

Temple Priest Cultivating Ganja  alongside marigold flower plants:   ఆధ్యాత్మిక మార్గంలో నడవాల్సిన ఒక పూజారి, అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే ఆశతో ఏకంగా ఆలయ ప్రాంగణాన్నే గంజాయి తోటగా మార్చేశాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగాం గ్రామంలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామంలోని ఆలయంలో పూజారిగా, ఆధ్యాత్మిక గురువుగా చలామణి అవుతున్న అవుటి నాగయ్య , భక్తి ముసుగులో గంజాయి సాగు చేస్తూ ఎక్సైజ్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. పూల తోటల మధ్య గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న ఈ వ్యవహారాన్ని చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు.

బంతి పూల తోటలో గంజాయి సాగు 

సంగారెడ్డి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్  బృందం శుక్రవారం పంచగాం గ్రామంలోని సర్వే నంబర్ 45/15/1 వద్ద మెరుపు దాడులు నిర్వహించింది. ఆలయ ప్రాంగణంలో బంతి పూల సాగు చేస్తున్నట్లు నమ్మిస్తూ, వాటి మధ్యలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా పూల మొక్కల మాటున ఈ అక్రమ దందాను సాగిస్తున్న నాగయ్యను టాస్క్ ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ దాడుల్లో భారీగా గంజాయి మొక్కలతో పాటు నిల్వ ఉంచిన డ్రగ్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

 రూ. 70 లక్షల విలువైన  గంజాయి స్వాధీనం 

ఈ సోదాల్లో అధికారులు 685 గంజాయి మొక్కలు, 17.741 కిలోల ఎండు గంజాయి,  సుమారు ఒక కిలో గంజాయి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ప్యాకెట్లుగా మార్చి విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు రూ. 30,000 నగదు, ఒక డిజిటల్ తూకం యంత్రం ,ఒక మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు రూ. 70 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులకు ఆధ్యాత్మిక బోధనలు చేసే వ్యక్తి ఇలాంటి మాదకద్రవ్యాల దందాకు పాల్పడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

 కటకటాల్లోకి పూజారి 

నిందితుడు నాగయ్యను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు, స్వాధీనం చేసుకున్న సొత్తుతో పాటు కేసు  ను తదుపరి చర్యల నిమిత్తం నారాయణఖేడ్ ఎస్హెచ్ఓ కు అప్పగించారు. ఈ గంజాయిని ఎక్కడికి సరఫరా చేస్తున్నాడు? ఈ ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆధ్యాత్మిక కేంద్రాలను ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చడంపై భక్తులు ,  స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.                             

టాప్ హెడ్ లైన్స్

Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget