Bhadrachalam ఎక్సైజ్‌ పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టిన కారు - పోలీసుల ఛేజింగ్‌తో చివరకు ఊహించని ట్విస్ట్

Ganja Caught: ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ కారు స్పీడుగా వచ్చి ఎక్సైజ్‌ శాఖ వాహనాన్ని ఢీ కొట్టి మరి పారిపోవాలని భావించాడు. పోలీసులు ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు.

FOLLOW US: 

భద్రాచలం పట్టణంలో సినిమా ఛేజింగ్‌ను తలపించేలా ఓ ఘటన జరిగింది. రాత్రివేళలో ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ కారు స్పీడుగా వచ్చి ఎక్సైజ్‌ శాఖ వాహనాన్ని ఢీ కొట్టి మరి పారిపోవాలని భావించాడు. చివరకు చేజింగ్‌లో తప్పించుకోవాలని యత్నించి, చివరికి కారు వదిలి పారిపోయాడు నిందితుడు. అయితే కారులో ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు చేయడంతో అందులో 380 కేజీల గంజాయి లభించింది. సినిమా ఛేజింగ్‌ తరహాలో భద్రాచలంలో జరిగిన ఈ సంఘటనలకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ ఎక్సైజ్‌ సీఐ రహీమున్నిసాబేగం ఆధ్వర్యంలో సిబ్బంది కూనవరం రోడ్‌లో తనిఖీలు చేపట్టారు. ఏపీ నుంచి భద్రాచలం వైపుగా స్పీడుగా వచ్చింది. పోలీసుల తనిఖీని గమనించిన వాహనంలోని వ్యక్తులు అతివేగంగా వచ్చి ఎక్సైజ్‌ పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టారు. అక్కడ్నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన ఎక్సైజ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ అలీమ్, నరేందర్, జమాల్‌తోపాటు కానిస్టేబుళ్లు వాహనాన్ని వెంబడించారు.
తెల్లవారుజామున సినీ పక్కీలో చేజింగ్‌.. 
కూనవరం రోడ్‌లో ఎక్సైజ్‌ పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించిన దుండగులు భద్రాచలం పట్టణంలో సుమారు కిలోమీటర్‌ మేరకు స్పీడ్‌గా డ్రైవ్‌ చేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ప్రధాన రహదారిపై వస్తే ఎలాగైనా పోలీసులకు చిక్కుతామని భావించి గోదావరి బ్రిడ్జి వద్దకు రాగానే వాహానాన్ని భద్రాచలం దేవాలయం వైపు మళ్లించారు. అయితే తనిఖీల సమయంలో తమ వాహనాన్ని ఢీకొట్టి అతివేగంగా వెళ్లిన కారును ఎలాగైనా పట్టుకోవాలని ఎక్సైజ్‌ శాఖ అధికారులు వారిని వెంబడించడంతో కారును వదిలేసి దుండగులు పరారయ్యారు. 

అనుమానం వచ్చిన ఎక్సైజ్‌ శాఖ అధికారులు కారును పరిశీలించగా అందులో రూ.90 లక్షల విలువ చేసే 380 కేజీల గంజాయి లభ్యమైంది. అయితే కారు జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందినదిగా ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. తెల్లవారుజామున సినీ పక్కిలో జరిగిన ఛేజింగ్‌ స్థానికులను ఆశ్చర్యానికి గురిచేశారు. అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతంగా భద్రాచలం ఉండటంతో ఈ ప్రాంతం నుంచే గంజాయి అక్రమ రవాణా చేసేందుకు దుండగులు వినియోగించుకుంటున్నారు. ఏది ఏమైనా తమ వాహనాన్ని ఢీకొట్టినప్పటికీ చాకచక్యంగా పోలీసులు గంజాయి కారును చేజ్‌ చేయడం పట్ల ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు సిబ్బందిని అభినందించారు. 

Also Read: Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Also Read: Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Published at : 21 May 2022 05:00 PM (IST) Tags: telangana bhadrachalam Ganja Excise Police Telangana Excise Police

సంబంధిత కథనాలు

KPHB Techie Murder: అల్లుడి అంతం కోసం 4.5 లక్షలకు సుపారీ, హత్య తర్వాత దూరంగా ఎడమకాలు! వెలుగులోకి కీలక విషయాలు

KPHB Techie Murder: అల్లుడి అంతం కోసం 4.5 లక్షలకు సుపారీ, హత్య తర్వాత దూరంగా ఎడమకాలు! వెలుగులోకి కీలక విషయాలు

Matrimony Sites Cheating : మాట్రిమోని సైట్ లో అమ్మాయిలా ఫేక్ ప్రొఫైల్, లక్షల్లో సమర్పించుకున్న బాధితులు!

Matrimony Sites Cheating : మాట్రిమోని సైట్ లో అమ్మాయిలా ఫేక్ ప్రొఫైల్, లక్షల్లో సమర్పించుకున్న బాధితులు!

Shamshabad Accident : శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి

Shamshabad Accident : శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి

Nizamabad Bank Robbery : బ్యాంకులో జులాయి సినిమా సీన్ రిపీట్, రూ.3 కోట్ల సొమ్ము చోరీ!

Nizamabad Bank Robbery : బ్యాంకులో జులాయి సినిమా సీన్ రిపీట్, రూ.3 కోట్ల సొమ్ము చోరీ!

Raghu Rama House Reccy : ఎంపీ రఘురామ ఇంటి చుట్టూ రెక్కీ - ఒకరిని పట్టుకున్న సీఆర్పీఎఫ్ !

Raghu Rama House Reccy : ఎంపీ రఘురామ ఇంటి చుట్టూ రెక్కీ - ఒకరిని పట్టుకున్న సీఆర్పీఎఫ్ !

టాప్ స్టోరీస్

Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భార‌త‌ ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు

Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భార‌త‌ ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు

RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?

RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?

Hyderabad Traffic News: నేడు రూట్స్‌లో వెళ్తే ఇరుక్కున్నట్లే! వేరే మార్గాలు చూసుకోవాలన్న పోలీసులు

Hyderabad Traffic News: నేడు రూట్స్‌లో వెళ్తే ఇరుక్కున్నట్లే! వేరే మార్గాలు చూసుకోవాలన్న పోలీసులు

Assam Floods: ఆ వరదలు కావాలని సృష్టించినవే- తాజాగా ఇద్దరు అరెస్ట్!

Assam Floods: ఆ వరదలు కావాలని సృష్టించినవే- తాజాగా ఇద్దరు అరెస్ట్!