Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Andhrapradesh News: నెల్లూరు జిల్లాలో ఓ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్ మృతి చెందగా.. 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.
![Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు students injured due to lorry collided school bus in kavali Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/1621f87ed9261e24b860364bbd54b94e1719897774381876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Students Injured In Accident In Kavali: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (Nellore) జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్ మృతి చెందగా.. 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్లీనర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేశారు.
ఈ ప్రమాదం తనను తీవ్ర ఆందోళనకు గురి చేసిందని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. 'ప్రమాదంలో క్లీనర్ చనిపోవడం బాధాకరం. గాయపడిన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించాను. స్కూలు యాజమాన్యాలు బస్సులన్నింటినీ కండీషన్‌లో ఉంచుకోవాలి. బస్సుల ఫిట్ నెస్ విషయంలో అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.' అని మంత్రి ట్వీట్ చేశారు.
కావలి సమీపంలో ఈరోజు పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్రమాదంలో క్లీనర్ చనిపోవడం బాధాకరం. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. స్కూలు యాజమాన్యాలు బస్సులన్నింటినీ కండీషన్ లో…
— Lokesh Nara (@naralokesh) July 2, 2024
Also Read: Nellore News నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం - భవనం పైనుంచి దూకి వైద్యురాలి ఆత్మహత్య?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)