అన్వేషించండి

Srikakulam News: భూసర్వే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను- సూసైడ్‌ నోట్‌ రాసి వీఆర్వో ఆత్మహత్యాయత్నం!

Srikakulam Crime News: శ్రీకాకుళం జిల్లాలో సమగ్ర భూ సర్వే పేరుతో అధికారుల పెట్టే ఒత్తిడి భరించలేక ఓ వీఆర్వో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు.  

Srikakulam Crime News: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఓ వీఆర్వో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమగ్ర భూసర్వే పేరుతో తనను అధికారులు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగేశారు. కానీ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు 


Srikakulam News: భూసర్వే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను- సూసైడ్‌ నోట్‌ రాసి వీఆర్వో ఆత్మహత్యాయత్నం!

సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య

డిల్లాలోని జి.సిగడాం మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన తనికెళ్ళ సంతోష్ అదే గ్రామ వీఆర్వోగా పని చేస్తున్నారు. అయితే గత కొంత కాలంగా సమగ్ర భూ సర్వే పేరుతో అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రతిరోజూ సర్వేలు పూర్తి చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. కానీ గ్రామంలోని పలువురి భూములు సరైన సర్వే నెంబర్లు లేకపోవడం, గొడవలు జరుగుతుండడంతో పనులు ఆగిపోయాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలని పైఅధికారులను ప్రశ్నిస్తే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. కానీ వెంటనే పనులు పూర్తి చేయాలని మాత్రం ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇది తట్టుకోలేని సంతోష్ ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ సూసైడ్ నోట్ కూడా రాసిపెట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగేశాడు. కానీ కాసేపటికే కుటుంబ సభ్యులు విషయాన్ని గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వీఆర్వో సంతోష్ చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. సూసైడ్ నోట్ ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇలాంటి ఘటనే అల్లూరు జిల్లాలో - ఎమ్మార్వో ఆత్మహత్య

అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాధం చోటు చేసుకుంది. పెదబయలు మండల తహసీల్దార్ శ్రీనివాసరావు.. పైఅధికారల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. రోజూలాగే ఉదయాన్నే కార్యాలయానికి వచ్చిన ఎమ్మార్వో శ్రీనివాస్.. ఆకలేస్తుంది, టిఫిన్ తీసుకు రమ్మని అటెండర్ కు సూచించారు. అటెండర్ తిరిగి వచ్చేసిరి తహసీల్దార్ శ్రీనివాస్ కార్యాలయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే టిఫిన్ తీసుకు వచ్చిన అటెండర్ ఎమ్మార్వో ఉరివేసుకొని చనిపోవడాన్ని గుర్తించి షాక్ అయ్యాడు. వెంటనే స్థానికులతో పాటు పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పోస్టుమార్టం నిమిత్తం తహసీల్దార్ శ్రీనివాస్ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచి పదవిలో ఉన్న తమ కుమారుడు.. అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడాన్ని శ్రీనివాస్ తల్లిదండ్రులు భరించలేకపోతున్నారు. 

అధికారుల వేధింపులు తాళలేకే బలవన్మరణం

అయితే ఎమ్మార్వో శ్రీనివాస్ బలవన్మరణానికి అధికారుల వేధింపులే కారణమని సిబ్బంది చెబుతున్నారు. ఈనెల 5వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశానికి శ్రీనివాస్ వెళ్లారు. ఈ కార్యక్రమంలోనే భూముల రీసర్వే విషయంలో ఐటీడీఏ పీఓ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ క్రమంలోనే బాధపడుతూ వచ్చిన శ్రీనివాస్ ప్రతిరోజూ తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget