News
News
X

Hyderabad Accident : ప్రాణాలు కాపాడేందుకు వెళ్లి ప్రాణం పోగొట్టుకున్నాడు - ఈ యువకుడి కథ కన్నీళ్లు తెప్పిస్తుంది !

రోడ్డుపై గుంత ప్రమాదకరంగా మారిందని .. పూడ్చాలని ఆ యువకుడు వెళ్లాడు. కానీ వేగంగా వచ్చిన ఓ కారు ఆ యువకుడ్ని ఢీ కొట్టింది. ప్రాణం తీసింది.

FOLLOW US: 

Hyderabad Accident :  రోడ్డు మీద ఒక్క గుంత చాలు ప్రాణం తీయడానికి. వేగంగా వెళ్తున్న బండి గుంతలో పడితే జరిగేది ప్రమాదమే.  ప్రాణాలు దక్కుతాయో లేదో చెప్పడం కష్టం. అలాంటి గుంత ఒకటి హైదరాబాద్‌లో ఓ యువకుడి ప్రాణం తీసింది. అయితే అతను రోడ్డు పరిస్థితిని చూసుకోకుండా వేగంగా డ్రైవ్  చేయడం లేదు. అసలు వాహనం మీద కూడా వెళ్లడం లేదు. చివరికి రోడ్డు కూడా దాటడం లేదు. కానీ ఆ గుంత కారణంగా ప్రాణం మాత్రం పోయింది. 

హైదరాబాద్‌లో కొత్త గ్యాంగ్ హల్‌చల్ - ఇలాంటివారిని పనిలో పెట్టుకుంటే ఇల్లు గుల్లే!

చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారికి ఓ పక్కన ఉండే సోహైల్ హోటల్లో పని చేస్తూంటాడు మహమ్మద్ జాహెద్. అతను హోటల్లో పని చేస్తున్నప్పుడు రోడ్డుపై వాహనాలు గుంతల్లో పడటం చూశాడు. దాని వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురుగాయపడ్డారు కూడా. దాంతో అతని మనసు చివుక్కుమంది. అదో ఒకటి వేసి ఆ గుంతను పూడిస్తే చాలా మంది ప్రమాదాల బారి నుంచి బయట పడతారని భావించాడు. అంతే.. కొంత మంది మట్టి తీసుకుని వెళ్లి ఆ పని చేయబోయాడు. కానీ అదే అతని పాలిట శాపమైంది. 

తండ్రిని బెల్టుతో, కర్రతో కొట్టిన కొడుకు, నేచురల్ డెత్‌గా నమ్మించేందుకు ప్రయత్నం! గుట్టు బయటికి ఇలా

అతను గుంతను పూడుస్తున్న సమయంలో ఓ వ్యక్తి అత్యంత వేగంగా ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ కారు ఎంత వేగంగా వెళ్తోందంటే.. జాహెద్ పది అడుగుల దూరం ఎగిరిపడ్డాడు. స్పాట్‌లో చనిపోయాడు. అయితే ఆ కారు మాత్రం ఆగలేదు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. పోలీసులు వాటిని సేకరించి కారు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. 

ఆగని లోన్ యాప్ ల వేధింపులు, పెద్దపల్లి జిల్లాలో యువకుడు ఆత్మహత్య

రోడ్డుపై గుంత పూడిస్తే పలువురు ప్రాణాలు నిలుస్తాయని మంచితనంతో ఆలోచించిన జాహెద్.. చివరికి ఆ గుంతను పూడ్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఒక వేళ జాహెద్ ఆ సమయంలో గుంతను పూడ్చానికి వెళ్లకపోయి ఉంటే అతన్ని ఢీకొట్టిన కారు ఖచ్చితంగా ఆ హోల్‌లో పడి స్కిడ్ అయి  ఎటు బోల్తాపడి ఉండేదో చెప్పడం కష్టం. కానీ జాహెద్ వారి ప్రాణాలను కాపాడాడు. తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇప్పుడా గుంత అంతే నిర్వికారంగా ఉంది. ఎవరైనా ఇక గుంతను పూడ్చే ఆలోచన చేస్తారా ? 

Published at : 13 Jul 2022 05:34 PM (IST) Tags: Hyderabad crime news Road Accident Hyderabad News Road Accident

సంబంధిత కథనాలు

Murder in Ghaziabad: పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి గొంతు కోసిన మహిళ- చివరికి ట్విస్ట్!

Murder in Ghaziabad: పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి గొంతు కోసిన మహిళ- చివరికి ట్విస్ట్!

Man Suicide: మొదటి భార్య మరణాన్ని తట్టుకోలేక, ఆమె సమాధి వద్దే ఆత్మహత్య!

Man Suicide: మొదటి భార్య మరణాన్ని తట్టుకోలేక, ఆమె సమాధి వద్దే ఆత్మహత్య!

Constable Murder: నంద్యాలలో కలకలం - బీర్ బాటిల్స్‌తో దాడి, కత్తులతో పొడిచి కానిస్టేబుల్ దారుణ హత్య! 

Constable Murder: నంద్యాలలో కలకలం - బీర్ బాటిల్స్‌తో దాడి, కత్తులతో పొడిచి కానిస్టేబుల్ దారుణ హత్య! 

Woman Rape: యువతిని గదిలో బంధించి సెక్యూరిటీ గార్డు అత్యాచారం, స్నేహంగా మెలిగితే ఇంత దారుణమా !

Woman Rape: యువతిని గదిలో బంధించి సెక్యూరిటీ గార్డు అత్యాచారం, స్నేహంగా మెలిగితే ఇంత దారుణమా !

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం!

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం!

టాప్ స్టోరీస్

Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!

Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!

Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్‌

Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్‌

Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!

Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!