Anantapuram News: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం - ఆరుగురు మృతి
Road Accident: అనంతపురం జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది. కారు అదుపు తప్పి లారీని ఢీకొన్ని ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Six People Died In Anantapuram: అనంతపురం జిల్లాలో (Anantapuram District) శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. టైరు పగిలి కారు అదుపు తప్పడంతో.. ఎదురుగా వస్తోన్న లారీని ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. మృతులంతా తాడిపత్రి నగరంలో ఇస్కాన్ నగర కీర్తన వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. వీరంతా అనంతపురానికి చెందిన సంతోష్, షణ్ముఖ్, వెంకన్న, శ్రీధర్, ప్రసన్న, వెంకీలుగాగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో రహదారిపై దాదాపు 2 గంటల మేర ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
Also Read: Andhra News: కొన్ని గంటల్లో పెళ్లి - నిన్న వధువు పరార్, నేడు ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు..