Crime News: సరిహద్దులో సరికొత్త ప్లాన్, ఆసిఫాబాద్ నుంచి మహారాష్ట్రకు మద్యం తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
Telangana News | తెలంగాణ సరిహద్దులో దేశీ లిక్కర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ ఉండటంతో అక్కడికి తరలించి అధిక ధరలకు మద్యం విక్రయించాలని చూసిన నిందితులను అరెస్ట్ చేశారు.
Kumuram Bheem Asifabad News | ఆసిఫాబాద్: తెలంగాణ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సరిహద్దులో ప్రాంతంలో కౌటాల పోలీసులు పట్టుకున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాస రావు, జిల్లా అదనపు ఎస్పి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు అక్రమంగా తరలిస్తున్న దేశీమద్యాన్ని కౌటాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఎన్నికలు ఉన్నందున సరికొత్త వ్యూహం అమలు చేసినా చివరికి పోలీసులకు దొరికిపోయారు.
మహారాష్ట్రలో ఎలక్షన్ కోడ్.. నిందితుల స్కెచ్
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మద్యపాన నిషేధం ఉంది. అలాగే చంద్రపూర్ జిల్లాలో మద్యపాన నిషేధం లేదు.. అందువలన మహారాష్ట్రలో ఎలక్షన్ కోడ్ నడుస్తున్నందున, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన పర్వతాల ప్రవీణ్, తుమ్మిడిహెట్టి గ్రామానికి చెందిన ఒడిల ప్రకాష్, గూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అగాడి కొండయ్య మద్యం తెచ్చి విక్రయించాలని ప్లాన్ చేశారు. ఈ ముగ్గురు వ్యక్తులు చంద్రపూర్ జిల్లా బంగారీ తర్విడికి వెళ్లి అక్కడ దేశిదారు మద్యం కొనుగోలు చేసి, రోడ్డు మార్గంలో వస్తే పోలీసుల చెక్ పోస్ట్ లు ఉన్నాయని తెలుసుకొని సరికొత్త ఎత్తుగడ వేశారు. ఆ మద్యంను పడవ సహాయంతో నది మార్గాన తుమ్మిడి హెట్టి గ్రామానికి తరలించి అక్కడి నుండి ఆటో ద్వారా గూడెం బ్రిడ్జి మార్గంలో గడ్చిరోలి జిల్లాలోని అహేరికి తీసుకువెళ్లి అధిక ధరలకు విక్రయించాలని భావించారు.
Also Read: TG Praja Vijayotsavalu: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మద్యం కొనుగోలు చేసి పడవ మార్గంలో తెచ్చి, ఆపై రోడ్డు మార్గంలో వెళుతుండగా తుమ్మిడి హెట్టి పరిసర ప్రాంతంలో కౌటల ఎస్సై మధుకర్, పోలీస్ సిబ్బంది నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి TS 01 UB 1406 నంబర్ గల ఆటో, 20 పెట్టెల దేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. మద్యం సుమారు Rs.1,80,000 ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. వారితో సిఐ ముత్యం రమేష్, ఎస్సై మధుకర్, సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Telangana CM రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి, లేకపోతే ఆందోళనలు ఉధృతం- జోగు రామన్న