Telangana CM రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి, లేకపోతే ఆందోళనలు ఉధృతం- జోగు రామన్న
Telangana CM Revanth Reddy | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని మాజీ మంత్రి జోగు రామన్న కీలక వ్యాఖ్యలు చేశారు.
Telangana Ex minister Jogu Ramanna | ఆదిలాబాద్: సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేరే వాళ్ళ చావులు కోరడం తన విజ్ఞతకే వదిలేస్తున్నామని.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి హింసను ప్రేరేపించేలా, ప్రజలను రెచ్చగొట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జోగు రామన్న తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు లపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న నిరసన చేపట్టారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు
సిఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సందర్భంగా సీఎం చిత్రపటాలను దగ్ధం చేసిన జోగు రామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అనంతరం మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేక విధానంతో తీవ్ర అసంతృప్తికి గురవుతూ సీఎం హోదాలో ఉండి తన స్థాయిని మరిచి.. దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ప్రజలను హింసకు ప్రేరేపించేలా కెసిఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన కెసిఆర్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, సిఎంను గౌరవించే పరిస్థితి లేకుండా చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ప్రజలకు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్.. హామీల అమలులో విఫలమవ్వడమే కాకుండా, ప్రధాన ప్రతిపక్ష నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సమర్ధించుకుంటున్నారని మండిపడ్డారు. ఈ 420 సీఎం రేవంత్ రెడ్డి.. హింసను ప్రోత్సహించేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలంను బిఆర్ఎస్ నేతలతో పాటు వెళ్లి కలిసిన మాజీ మంత్రి జోగు రామన్న సీఎం రేవంత్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు.
Also Read: TG Praja Vijayotsavalu: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇదివరకే రెండుసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదనీ, ఈసారి నా కేసు నమోదు చేయాలని లేని పక్షంలో తీవ్ర ఆందోళనలు ముదురుతం చేస్తామన్నారు. వారితో ఆదిలాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, బిఆర్ఎస్ నాయకులు అలాల అజయ్, విజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, గండ్రత్ రమేష్, దాసరి రమేష్, కొండా గణేష్, పవన్ నాయక్, దమ్మాపాల్, బట్టు సతీష్, సలీమ్ తదితరులు పాల్గొన్నారు.